Mosagallaku Mosagadu Collections: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి కౌ బాయ్ జానర్ ని పరిచయం చేసిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆరోజుల్లో జనాలు ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తీసే సినిమాలనే చూసేవాళ్ళు. ఇండస్ట్రీ లో అప్పటికే కొంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ , ఏఎన్నార్ రేంజ్ కి చేరుకోలేకపోయారు.
అలాంటి సమయం లో వాళ్లకి దీటుగా నేనున్నాను అని సూపర్ స్టార్ కృష్ణ ని నిలబెట్టేలా చేసిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. అంతే కాదు టాలీవుడ్ కి మొట్టమొదటి సౌత్ స్కోప్ చిత్రం కూడా ఇదే. ఆరోజుల్లోనే ఈ సినిమా 10 పైసల టికెట్ రేట్స్ తో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే బాహుబలి సాధించిన వసూళ్ల కంటే ఎక్కువ అన్నమాట.
అలాంటి బ్లాక్ బస్టర్ ని రీసెంట్ గా కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో గ్రాండ్ గా విడుదల చేసారు. 50 ఏళ్ళ క్రితం సినిమా, ఇప్పుడు ట్రెండ్ బాగా మారింది. ఇప్పటి జనం అప్పటి సినిమాని థియేటర్స్ కి వెళ్లి ఏమి చూస్తారు లే అని అనుకున్నారు అందరూ.కానీ ఈ చిత్రానికి మొదటి రోజు ప్రధాన నగరాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 40 లక్షల రూపాయిల గ్రాస్, మరియు రెండవ రోజు 10 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందని అంటున్నారు.
కేవలం ఈ రెండు రోజులు మాత్రమే షోస్ ని ప్రదర్శించారు, మూడవ రోజు నుండి అన్నీ ప్రాంతాలలో తీసేసారు. అయితే 50 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమాకి ఇంత వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కృష్ణ గారికి జనాల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అంటూ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.