https://oktelugu.com/

Virupaksha OTT: ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ‘విరూపాక్ష’..2 వారాల్లో వచ్చిన వ్యూస్ ఇంతేనా!

మే 20 వ తారీఖున స్ట్రీమింగ్ మొదలైన ఈ చిత్రం అప్పుడే నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లిస్ట్ లో 7 వ స్థానానికి పడిపోయింది. దీనితో పాటు విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'దసరా' హిందీ వెర్షన్ ఇప్పటికీ టాప్ 3 లో ట్రెండింగ్ అవుతుంది.'విరూపాక్ష' చిత్రం కూడా తెలుగు తో పాటు హిందీ , కన్నడ , మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : June 2, 2023 8:40 am

    Virupaksha OTT

    Follow us on

    Virupaksha OTT: ఈ సమ్మర్ లో థియేటర్స్ లో ప్రేక్షకులను ఒక రేంజ్ లో భయపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘విరూపాక్ష’ చిత్రం రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో సుమారుగా 50 కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్. కానీ కథ అడ్డం తిరిగింది.

    మే 20 వ తారీఖున స్ట్రీమింగ్ మొదలైన ఈ చిత్రం అప్పుడే నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లిస్ట్ లో 7 వ స్థానానికి పడిపోయింది. దీనితో పాటు విడుదలైన న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ హిందీ వెర్షన్ ఇప్పటికీ టాప్ 3 లో ట్రెండింగ్ అవుతుంది.’విరూపాక్ష’ చిత్రం కూడా తెలుగు తో పాటు హిందీ , కన్నడ , మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

    కానీ కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే టాప్ 7 స్థానం లో కొనసాగుతుంది. దీనిని బట్టీ చూస్తుంటే ఓటీటీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని పెద్దగా ఆదరించడం లేదని అర్థం అవుతుంది. కొన్ని సినిమాలు కేవలం థియేటర్స్ కి మాత్రమే సూట్ అవుతాయి. థియేటర్స్ లో చూస్తే వచ్చే అనుభూతి టీవీ లో చూసినప్పుడు రాదు. ‘విరూపాక్ష’ విషయం లో కూడా జరిగింది ఇదే. కానీ ఈ సినిమా కొద్దీ రోజుల తర్వాత హిందీ, తమిళం , మళయాలం మరియు కన్నడ బాషలలో కూడా థియేటర్స్ లో విడుదలైంది.

    ఆ భాషల్లో రెస్పాన్స్ సూన్యం, కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ చిత్రం ఇతర బాషల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పింహలేకపోయిందని విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. తెలుగు థియేటర్స్ లో డబల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రానికి ఓటీటీ మరియు ఇతర బాషల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ పై మూవీ టీం కాస్త నిరాశకు గురైంది.