https://oktelugu.com/

Lavanya Tripathi: విడిపోయిన నిహారిక – చైతన్యలను కలపడానికి లావణ్య త్రిపాఠి ఇంత పెద్ద త్యాగం చేసిందా..! బయటపడ్డ షాకింగ్ నిజాలు

అలా చాలా కాలం వరకు తన పెళ్లిని వాయిదా వేసి నిహారిక మరియు చైతన్య ని కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందట. ఎంత ప్రయత్నం చేసినా వాళ్లిద్దరూ తగ్గకపోవడం , లావణ్య త్రిపాఠి ఇంట్లో కూడా పెళ్లి విషయం లో ఒత్తిడి పెంచడం తో ఇక చేసేది ఏమి లేక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది లావణ్య, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : June 2, 2023 / 08:28 AM IST

    Lavanya Tripathi

    Follow us on

    Lavanya Tripathi: నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల తన భర్త చైతన్య తో గత కొంత కాలం నుండి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి వార్తలు వచ్చాయి. కానీ వీళ్ళ విడాకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు దూరం గా ఉంటున్నారు అని మాత్రమే చెప్పగలం. నిహారిక కొణిదెల తన సినిమాలతో తానూ బిజీ గా ఉంటే, చైతన్య కూడా తన పని తానూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

    రీసెంట్ గా తిరుమలలో కూడా ఆయన తన తల్లి తండ్రులతో కలిసి వేళ్ళాడే కానీ, నిహారిక కొణిదెల ఎక్కడా కూడా కనిపించలేదు. దీనితో వీళ్ళు విడాకులు తీసేసుకున్నారు అనే విషయం జనాలందరికీ అర్థం అయిపోయింది. వీళ్ళ పెళ్లి ఏ రేంజ్ లో జరిగిందో అందరికీ తెలిసిందే, ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో వీళ్లిద్దరి వివాహాన్ని జరిపించాడు మెగా బ్రదర్ నాగబాబు.

    ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో లు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.మెగా ఫ్యాన్స్ కి ఈ వివాహ మహోత్సవం ఒక మధురమైన జ్ఞాపకం లాంటిది. అయితే నిహారిక కి వరుణ్ తేజ్ కాబొయ్యే భార్య లావణ్య త్రిపాఠి బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే. ఆమె నిహారిక మరియు చైతన్య ని కలపడానికి చాలా ప్రయత్నాలే చేసిందట. వాస్తవానికి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి గత ఏడాదే జరగాలి, కానీ నిహారిక కాపురం చక్కబడే వరకు మన పెళ్లిని ఆపుదాం అని లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో అనిందట.

    అలా చాలా కాలం వరకు తన పెళ్లిని వాయిదా వేసి నిహారిక మరియు చైతన్య ని కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందట. ఎంత ప్రయత్నం చేసినా వాళ్లిద్దరూ తగ్గకపోవడం , లావణ్య త్రిపాఠి ఇంట్లో కూడా పెళ్లి విషయం లో ఒత్తిడి పెంచడం తో ఇక చేసేది ఏమి లేక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది లావణ్య, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
    Recommended Video: