Monalisa Marriage With Farman Khan: గత ఏడాది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహా కుంభమేళా జరిగింది. అక్కడ ఓ యువతి పూసలు అమ్ముకుంటూ కనిపించింది. కొంతమంది యూట్యూబర్లు ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నీలి కళ్ళతో.. అమాయకపు చూపులతో ఆమె ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు సినీ అవకాశాలు కూడా వచ్చాయి. ఓ సినిమాలో సినీనటిగా కూడా నటిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. మోనాలిసా ఉన్నట్టుండి బుధవారం జాతీయ మీడియా నుంచి మొదలు పెడితే ప్రాంతీయ మీడియా వరకు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
మోనాలిసా కేరళ రాష్ట్రంలో పువార్ అరమనూర్ నైనార్ ఆలయంలో ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి కేరళ మంత్రి శివన్ కుట్టి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ హాజరయ్యారు.
ఫర్మాన్ ఖాన్ స్వస్థలం మహారాష్ట్ర. మోనాలిసా ది మధ్యప్రదేశ్. వీరిద్దరి మధ్య కొంతకాలంగా పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని మోనాలిసా తన ఇంట్లో చెప్పగా వారు వ్యతిరేకించారు. అంతేకాదు ఆమెకు వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియుడిని మర్చిపోలేక.. కన్నవాళ్లను ఎదిరించి మోనాలిసా బయటకు వచ్చింది. తన ప్రియుడితో కలిసి కేరళ వచ్చింది. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేరళ మంత్రి, అక్కడ అధికార పార్టీ కార్యదర్శి ఆమె వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.
వివాహం చేసుకున్న తర్వాత మోనాలిసా తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని వారిని కోరింది.. మోనాలిసా కేరళ రావడం.. ఓ గుడిలో తన ప్రియుడితో కలిసి వివాహం చేసుకోవడం.. వంటి పరిణామాలు జాతీయ మీడియాలో రావడంతో సంచలనం నమోదయింది.. సోషల్ మీడియాలో మోనాలిసా, ఆమె భర్త ఫోటోలు విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి.
మోనాలిసా సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో.. ఓ సాధారణ యువకుడితో ప్రేమలో పడటం.. అతడిని పెళ్లి చేసుకోవడం వంటి పరిణామాలు అచ్చం సినిమాను తలపిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.. మోనాలిసా ప్రేమ వివాహంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంతవరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ అయిపోయిన మోనాలిసా.. ఇప్పుడు తన పెళ్లి ద్వారా కూడా అదే స్థాయిలో జాతీయ మీడియాలో ప్రాచుర్యాన్ని పొందడం ఇక్కడ గమనార్హం.