https://oktelugu.com/

బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట !

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరిగినా.. దానికి ఓ డ్రామా ఉంటుంది. హౌస్ లో ఎవరు ఏం చేసినా.. ఏం జరిగినా ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. అందుకే షోలో జరిగే డ్రామాను ఎవ్వరూ ఊహించలేరు. కంటెస్టెంట్ లకు ప్రేక్షకుల నుండి ఎంత బలమైన సపోర్ట్ ఉన్నా… రాత్రికి రాత్రే అన్నీ రివర్స్ అయిపోతాయి. దీనికితోడు ఈ రోజు ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి, రేపు శత్రువుగా మారిపోతాడు. ఇవాళ […]

Written By:
  • admin
  • , Updated On : November 24, 2020 / 07:16 PM IST
    Follow us on


    బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరిగినా.. దానికి ఓ డ్రామా ఉంటుంది. హౌస్ లో ఎవరు ఏం చేసినా.. ఏం జరిగినా ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. అందుకే షోలో జరిగే డ్రామాను ఎవ్వరూ ఊహించలేరు. కంటెస్టెంట్ లకు ప్రేక్షకుల నుండి ఎంత బలమైన సపోర్ట్ ఉన్నా… రాత్రికి రాత్రే అన్నీ రివర్స్ అయిపోతాయి. దీనికితోడు ఈ రోజు ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి, రేపు శత్రువుగా మారిపోతాడు. ఇవాళ ప్రేమ ఉంటుంది.. రేపు పగ పుట్టుకొస్తోంది. అంతా బిగ్ బాస్ క్రియేట్ చేసే గేమ్స్ మాయనే. అయితే ఈ వారం నామినేషన్లతో హౌస్ లో అసలు ఎవరు ఎవరికి ఫ్రెండ్స్.. ఎవరు ఎవరికి శత్రువులు అని క్లారిటీ వచ్చినట్టుంది. అందుకే ఒకరి పై ఒకరు తెగ కోపంతో ఉన్నారు.

    Also Read: అక్కినేని ఫ్యామిలీలో.. అక్కినేని యష్ !

    ముఖ్యంగా మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి మొత్తానికి ఓ పుల్ స్టాప్ పడింది. ఎందుకంటే.. నామినేషన్ల కంటే ముందు అఖిల్ తో మోనల్ కు చెడింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో గాని, కెప్టెన్సీ టాస్క్ తర్వాత మోనల్, అఖిల్ ఇద్దరూ గొడవ పడి బ్రేకప్ చెప్పేసుకోవడం.. ఆ తర్వాత నామినేషన్లలోనూ ఓ రేంజ్ లో గొడవ పడటం.. ఇక ఫైనల్ గా నీకు, నీ ఫ్రెండ్ షిప్ కు ఓ దండం తల్లి అంటూ అఖిల్, మొత్తానికి మోనల్ కు ఓ నమస్కారం పేట్టి ఆమెను కట్ చేసేశాడు. మోనల్ కూడా అఖిల్ తో ఓ రేంజ్ లో కటీఫ్ చెప్పేసింది అనుకోండి.

    Also Read: ‘దుర్గమతి’ రాబోతుంది.. మరి అలరిస్తోందా ?

    అయితే అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు కథ ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది. మోనాల్ అక్కడ అఖిల్ తో కటీఫ్ చెప్పిందో లేదో.. అంతలోనే అభిజీత్ తో ఓ ట్రాక్ ను స్టార్ట్ చేసింది. దీనికితోడు అభిజీత్ నాన్న స్టేజీ మీదికి వచ్చినప్పుడు.. ‘నాకు మోనల్ అంటే ఇష్టం’ అని అభిజీత్ ఫాదర్ ఎప్పుడైతే చెప్పాడో.. అప్పుడే మోనాల్ కి అభిజీత్ కి మధ్య బంధం మరింత బలపడింది. పైగా ఇదే పాయింట్ ను మోనల్ దగ్గర ప్రస్తావిస్తూ.. అసలు నువ్వు మా నాన్నకు నచ్చినవంటే అసలేందో అబ్బ.. అర్థం అయితలేదు.. అంటూ రొమాంటిక్ గా అభిజీత్ చెప్పడం… దానికి మోనల్ కూడా రొమాంటిక్ గా అభి వైపు ఓ లుక్ వేయడంతో మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట పుట్టిన్నట్టు అయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్