Mokshagna and Balayya Babu : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు ఎలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికి తమ నట వారసులను మాత్రం చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి రామ్ చరణ్ ని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లాడు. అక్కినేని ఫ్యామిలీ హీరోల విషయంలో ఇది కొంతవరకు వర్కౌట్ కానప్పటికి వాళ్లు అడపదడప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి వస్తున్న మోక్షజ్ఞ ఏ స్థాయి కి వెళ్తాడు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : బాలయ్య మనవడు కూడా వస్తున్నాడు…కానీ తన కొడుకు ఎంట్రీ ఎప్పుడు అనేది చెప్పడం లేదు..?
సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ దర్శకులు సైతం మంచి కథలను ఎంచుకొని హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథలను మార్పులు చేర్పులు చేస్తూ హీరో ఎలా నటించాలి అని చెప్పి అతని చేత చేయించుకొని ఆ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలుపుతూ ఉంటారు. కానీ హీరోలకు వచ్చినంత పేరు దర్శకులకైతే రాదు. ఎందుకంటే తెరమీద కనిపించేది హీరోనే కాబట్టి అతన్ని చూడడానికే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. కాబట్టి అల్టిమేట్ గా అతనికి ఎక్కువ గుర్తింపు అనేది వెళుతుంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాలయ్య బాబు(Balayya Babu) మాత్రం చాలా మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు తన కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే విషయం మీద చాలా చర్చలైతే జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. అయితే ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుందంటూ రీసెంట్ గా ఒక న్యూస్ అయితే బయటికి వచ్చింది.
మరి ఈ సినిమాలో బాలయ్య బాబు (Balayya Babu) కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడట. తన కొడుకుకి సపోర్టుగా బాలయ్య బాబు ఈ సినిమాలో నటించడం తన కొడుకుని ఎలాగైనా సరే స్టార్ హీరోగా మార్చాలనే ఉద్దేశ్యంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను సాధించాలని పలు విధాలుగా పరతపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!
మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు చేస్తున్న సినిమాలతో తనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ మోస్తున్నాడు. ఇకమీదట నుంచి మోక్షజ్ఞ ను వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు అయితే ఉన్నాడు.
మరి ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దానికి అనుగుణంగానే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా 2026వ సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడట…