NTR , Balayya
NTR and Balayya : బాలకృష్ణను నట వారసుడిగా ఎంపిక చేసుకున్న నందమూరి తారకరామారావు బాల్యం నుండి ప్రోత్సహించాడు. హీరోగా అరంగేట్రం చేశాక.. కథలు, దర్శకుల ఎంపికలో ఎన్టీఆర్ భాగమయ్యేవాడు. ఆ తరం గొప్ప దర్శకులతో బాలయ్యకు సినిమాలు సెట్ చేసేవారు. 80-90లలో ఏ. కోదండరామిరెడ్డి ఇండస్ట్రీని ఏలారు. ఆయన దర్శకత్వంలో అనేక సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు అయ్యాయి. ఇక పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్ గా ఉన్నారు. కథ, మాటలను సమకూర్చడంలో వారికి తిరుగులేదు.
ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్ ఒక కథను ఎన్టీఆర్ కి వినిపించారట. చాలా బాగా నచ్చిందట. బాలకృష్ణ పోలీస్ రోల్ లో చాలా బాగా ఉంటాడు. ఈ కథ బాలయ్యతో చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడట. దర్శకుడిగా ఏ. కోదండరామిరెడ్డిని ఎంచుకున్నారు. పరుచూరి బ్రదర్స్, కోదండరామిరెడ్డిలను పిలిచి ఎన్టీఆర్ ఆ కథ వినిపించాడట. కథ ఎలా ఉంది బ్రదర్ అని డైరెక్టర్ ని ఎన్టీఆర్ అడిగాడట. నాకు కథ నచ్చలేదు సర్, అని డైరెక్టర్ నేరుగా చెప్పేశాడట. దర్శకుడికి కథ నచ్చనప్పుడు సినిమా చేయలేము. ఇంకో కథ రాయండి .. అని పరుచూరి బ్రదర్స్ కి ఎన్టీఆర్ చెప్పాడట.
Also Read : బాలయ్య పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..ఎన్టీఆర్ అభిమానులను బ్రతిమిలాడుతూ ‘డాకు మహారాజ్’ నిర్మాత ట్వీట్!
బయటకు వచ్చాక పరుచూరి బ్రదర్స్.. డైరెక్టర్ పై మండిపడ్డారట. ఆయనకు ఎంతో బాగా నచ్చిన కథ నచ్చలేదు అన్నవేంటయ్యా.. అన్నారట. కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఆ కథ ఎందుకో బాలయ్యకు బాగా సెట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. మీరు సినిమా చేయండి, అన్నారట. దాంతో చేసేది లేక డైరెక్టర్ కోదండరామిరెడ్డి సినిమాను పట్టాలెక్కించాడట. షూటింగ్ జరిగేటప్పుడే.. బాలయ్య ఇది డిజాస్టర్ మూవీ అని తేల్చేశాడట.
ఫైనల్ గా మూవీ థియేటర్స్ లోకి వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ తిరగబడ్డ తెలుగు బిడ్డ. 1988లో విడుదలైన ఈ చిత్రంలో సుహాసిని హీరోయిన్ గా నటించింది. ఓ కథను ఎన్టీఆర్ జడ్జి చేయడంలో ఫెయిల్ అయ్యాడు . బాలయ్య మాత్రం కథ వర్క్ అవుట్ కాదని ముందే అంచనా వేశాడు. కోదండరామిరెడ్డి మాట వినకుండా మూవీ చేసిన ఎన్టీఆర్ కొడుకు బాలయ్య ఒక డిజాస్టర్ ఇచ్చాడు.
Also Read : ఎన్టీయార్ బాలయ్య ల మధ్య జరిగిన గొడవ ఇదేనా..? ఇన్ని రోజులకు వెలుగులోకి వచ్చిందా..?
Web Title: Ntr balayya story kathalu results reaction
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com