AP Dwakra : ఏపీలో( Andhra Pradesh) స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. వారికి వడ్డీ రాయితీ రుణాలు పెంచాలని భావిస్తోంది. అయితే ఆర్థికపరమైన లావాదేవీల ప్రక్రియలో మోసాలను అరికట్టడానికి, రుణాలను మరింత సులభతరం చేయడానికి సరికొత్త యాప్ అందుబాటులోకి తేనుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇకపై ఈ యాప్ ద్వారానే రుణాలు పొందవచ్చు. పారదర్శకతతో కూడిన నగదు రహిత చెల్లింపులకు అవకాశం కలగనుంది. దీని ద్వారా మహిళలు మరింత అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్వాక్రా మహిళలపై దృష్టి పెట్టింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెప్మా లోన్ చార్జ్ క్రియేషన్ యాప్ ద్వారా రుణాలు అందించేందుకు నిర్ణయించారు. గతం మాదిరిగా నేరుగా రుణాలు ఇవ్వరు. మెప్మా ద్వారా ఈ కొత్త యాప్ ద్వారానే రుణ మంజూరు ప్రక్రియ జరగనుంది. క్రమేపీ గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక సంఘ సభ్యులకు కూడా ఈ యాప్ అందుబాటులోకి తేనున్నారు.
Also Read : డ్వాక్రా మహిళలకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై చాలా సులభం…
* రాష్ట్రవ్యాప్త సమాచారం..
రాష్ట్రవ్యాప్తంగా 2.74 లక్షల స్వయం సహాయక సంఘాల సమాచారం ఈ యాప్ లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను బ్యాంకులకు అనుసంధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 బ్యాంకులకు( banks ) సంబంధించి 2000కు పైగా బ్రాంచీలకు లాగిన్ ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రుణాలు ఇవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో పదివేల మంది మహిళలకు పారిశ్రామిక వ్యాప్తులుగా మార్చడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. బ్యాంకు రుణాలు ఇచ్చి మహిళలు వ్యాపారాలు చేయడానికి ఇవి సహాయం అందిస్తాయి. దీని ద్వారా ఎక్కువమంది మహిళలు సొంతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం.
* స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు
ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలతో పాటు పొదుపు మొత్తాన్ని బ్యాంకులకు వెళ్లి చెల్లింపులు చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు చెల్లింపుదారుల వద్ద కమీషన్ అందించి చెల్లింపులు చేస్తున్నారు. ఇకపై అటువంటి అవసరం లేదు. స్మార్ట్ ఫోన్( smart phone) ఉంటే చాలు. ఈ యాప్ ద్వారా స్త్రీ నిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మాసాలను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నారు. రుణ వాయిదా చెల్లింపుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. దీనివల్ల చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి వంటి రుణాలను సక్రమంగా అందించవచ్చు. స్త్రీ నిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకోవచ్చు.
Also Read : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!
* పారదర్శకత కోసమే..
ఈ యాప్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వ భావిస్తోంది. నేరుగా చెల్లింపులు చేయడంతో సమయం కూడా ఆదా అవుతుంది. నెలవారి వాయిదాలను ఆన్లైన్లో సులభంగా చెల్లించవచ్చు. చెల్లింపు చేసిన వెంటనే మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దీనివల్ల నగదు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. పైగా లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్ లో అందుబాటులో ఉంటుంది. మొత్తానికి అయితే డ్వాక్రా మహిళల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సంతృప్తి వ్యక్తం అవుతోంది.