https://oktelugu.com/

Mohanlal : నా సినిమాతో పోలికనా?’..చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పై మోహన్ లాల్ రియాక్షన్!

Mohanlal : లూసిఫర్' చిత్రం మలయాళం సినీ ఇండస్ట్రీ మార్కెట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తే, గాడ్ ఫాదర్ చిత్రం కేవలం యావరేజ్ రేంజ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. ఫస్ట్ హాఫ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ లో అనేక మార్పులు చేర్పులు చేసి చెడగొట్టేసారు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ వద్దనే ఆగిపోయింది. ఓటీటీ లో వచ్చిన రెస్పాన్స్ కూడా అంతంత మాత్రమే. ఇది ఇలా ఉండగా 'లూసిఫర్' కి సీక్వెల్ గా 'ఎల్ 2: ఎంపురాన్'(L2: Empuran) అనే చిత్రం తెరకెక్కింది.

Written By: , Updated On : March 25, 2025 / 08:15 PM IST
Mohanlal

Mohanlal

Follow us on

Mohanlal : రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అత్యధిక శాతం రీమేక్ సినిమాలే చేసాడు. అందులో ‘గాడ్ ఫాదర్'(Godfather) చిత్రం ఒకటి. మలయాళంలో మోహన్ లాల్(Mohanlal) హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లూసిఫర్'(Lucifer Movie) కి ఇది రీమేక్. ‘లూసిఫర్’ చిత్రం మలయాళం సినీ ఇండస్ట్రీ మార్కెట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తే, గాడ్ ఫాదర్ చిత్రం కేవలం యావరేజ్ రేంజ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. ఫస్ట్ హాఫ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ లో అనేక మార్పులు చేర్పులు చేసి చెడగొట్టేసారు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ వద్దనే ఆగిపోయింది. ఓటీటీ లో వచ్చిన రెస్పాన్స్ కూడా అంతంత మాత్రమే. ఇది ఇలా ఉండగా ‘లూసిఫర్’ కి సీక్వెల్ గా ‘ఎల్ 2: ఎంపురాన్'(L2: Empuran) అనే చిత్రం తెరకెక్కింది.

Also Read : ‘సలార్’ రీ రిలీజ్ క్లోజింగ్ కలెక్షన్స్..టాప్ 10 లో ఏ స్థానంలో ఉందంటే!

ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో మోహన్ లాల్ చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. రీసెంట్ గా తెలుగు వెర్షన్ ప్రొమోషన్స్ కి వచ్చిన మోహన్ లాల్, విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాదానాలు ఇచ్చాడు. ఒక రిపోర్టర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగు లో చిరంజీవి గారు ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసారు.ఇప్పుడు లూసిఫర్ సీక్వెల్ వచ్చింది. ఈ సినిమాని కూడా ఆయన రీమేక్ చేసుకునేందుకు అనువుగా ఉంటుందా?’ అని అడగగా, దానికి మోహన్ లాల్ సమాధానం చెప్తూ ‘చిరంజీవి గారి గాడ్ ఫాదర్ చిత్రాన్ని చూసాను. బాగానే ఉంది కానీ మా లూసిఫర్ లో ఉన్న క్యారెక్టర్స్ ని చాలా వరకు మార్చేశారు. కాబట్టి ఈ సీక్వెల్ చిరంజీవి గారికి ఉపయోగపడకపోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.

బహిరంగంగా చిరంజీవి గారికి ఈ సినిమా సూట్ అవ్వదు అని చెప్పడం తో సోషల్ మీడియా లో మోహన్ లాల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రానికి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా దాటిందని టాక్. మలయాళం సినీ ఇండస్ట్రీ లో మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం కష్టం, అలాంటిది ఈ చిత్రం రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆ మార్కుని అందుకుందంటే, ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. కచ్చితంగా మలయాళం సినీ ఇండస్ట్రీ మార్కెట్ తలరాతను మార్చే సినిమాగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. చూడాలి మరి ఏ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుంది అనేది.

Also Read : లేడీ విలన్ గా రెజీనా ఫుల్ బిజీ..రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందంటే!