Regina Cassandra : ఒకప్పుడు హీరోయిన్స్ గా గొప్పగా రాణించిన వారు, ఇప్పుడు క్యారక్టర్ రోల్స్ లో దుమ్ములేపుతూ నేటి తరం ఆడియన్స్ ని కూడా బాగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా యంగ్ జనరేషన్ హీరోయిన్స్ కూడా తమకు హీరోయిన్స్ గా ఆఫర్స్ తగ్గిపోవడం తో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) ఈ ట్రెండ్ కి నాంది పలికింది. ప్రముఖ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్, అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి సక్సెస్ లను అందుకుంది. కానీ కొత్త హీరోయిన్స్ దాటికి ఈమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అప్పుడు ఆమె రూట్ మార్చి క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధమైంది. అప్పటి నుండి విలన్ రోల్స్ చేస్తూ సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్స్ లో ఒకరిగా మారిపోయింది.
Also Read : ‘అది దా సర్ప్రైజ్’ పాటకు కేతిక శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ఇప్పుడు యంగ్ హీరోయిన్ రెజినా కాసాండ్రా(Regina Cassandra) కూడా అదే దారిలో వెళ్తుంది. యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత హీరోయిన్ గా మారి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోలందరూ రెజీనా ని తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేవారు. కానీ ఈమెకు కూడా కొత్త హీరోయిన్స్ తాకిడి కారణంగా సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గాయి. అప్పుడు రూట్ మార్చి విలన్ రోల్స్ చేయడానికి సిద్ధమైంది. ‘ఎవరు’ చిత్రం లో విలన్ రోల్ చేసి మంచి క్రేజ్ ని తెచ్చుకున్న రెజీనా, ఆ తర్వాత 7 , చక్ర వంటి చిత్రాల్లో విలన్ రోల్స్ చేసింది. రీసెంట్ గా ఆమె అజిత్(Thala Ajith) హీరో గా నటించిన ‘విడాముయార్చి'(Vidaamuyaarchi Movie) చిత్రంలో కూడా విలన్ రోల్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇక వచ్చే నెల విడుదల కాబోతున్న ‘జాట్'(Jatt Movie) చిత్రంలో కూడా ఈమె విలన్ రోల్ చేసింది.
ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎలాంటి క్యారక్టర్ ని ఇచ్చినా చేయగలను అనే నమ్మకం ఇవ్వడంతో రెజీనా కి కేవలం నెగటివ్ రోల్స్ మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ రోల్స్, నటనకు ప్రాధాన్యం ఉన్న పవర్ ఫుల్ పాజిటివ్ రోల్స్ కూడా పడుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి 8 సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీ గా ఈమెతో పాటు మొదలైన హీరోయిన్స్ ఇప్పుడు లేరు. ఇదంతా ‘ఎవరు’ చిత్రం నుండే మొదలైంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని రెమ్యూనరేషన్ ఇది. రాబోయే రోజుల్లో ఆమె ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read : కత్రినా కైఫ్ పిల్లల్ని కనకపోవడానికి కారణం అదేనా? సల్మాన్ కామెంట్స్ వైరల్!