Mohan Lal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ఎంత చెప్పిన తక్కువే. కంప్లీట్ యాక్టర్ అని పేరు గడించిన మోహన్ లాల్ ఫాలోయింగ్ గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. కేవలం కేరళలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఐతే ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త గూర్చి అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. అభిమాన హీరో సినిమా ఓటీటీలో వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్ రిలీజ్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో ఆయా భాషల్లో చిన్న, పెద్ద సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఐదు సినిమాలు ఏకంగా ఓటీటీలోనే రాబోతుండటం ఇప్పుడు పెద్ద దుమరాన్ని రేపుతున్నాయి. పైగా అందులో భారీ బడ్జెట్ తో తెరకెక్కి జాతీయ అవార్డు పొందిన “మరక్కార్” కిత్రమ్ కూడా ఉండడం గమనార్హం. ఇటీవల ఈ చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబూర్ ‘మరక్కర్’ను త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ల వల్ల సినిమా విడుదల ను పోస్ట్ పోన్ చేశారు. దీంతో సినిమాను డైరెక్ట్‌గా డిజిటల్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్‌తో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంటోనీ చెబుతున్నారు. ఇప్పుడు ఆంటోనీ సహాయ సహకారాలతో రూపొందుతున్న మరో నాలుగు మోహన్‌లాల్ సినిమాలు కూడా డైరెక్ట్ గా డిజిటల్ లోనే విడుదల కాబోతున్నాయి అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ‘బ్రో డాడీ, 12వ వ్యక్తి, అలోన్… వైశాఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓటీటీ లోనే విడుదల కాబోతున్నాయంట. దీంతో ఆయన అభిమానులంతా ఈ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మోహన్ లాల్ నటించిన గత చిత్రం ‘దృశ్యం 2’ కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.