
Priyanka Singh: బిగ్ బాస్ ప్రయాణంలో రోజులు గడిచే కొద్దీ ఎమోషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రయాణంలో ప్రతి వారం వారం ఎవరొకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. గేమ్ ముందుకు సాగాలంటే ప్రతి వారం ఏదొక కంటెస్టెంట్ నామినేట్ అవ్వాల్సిందే… ఆదివారం ఎలిమినేట్ అవ్వాల్సిందే. అలా ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.
ఇలా మొదటివారం నుండు ఇప్పటివరకు వరసగా సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ఆర్టిస్ట్ ప్రియా, లోబో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మరి తొమ్మిదో వారానికి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. తొమ్మిదో వారానికి బిగ్ బాస్ నుండి బయట వెళ్ళడానికి కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ కాకుండా మిగతా ఇంటి సభ్యులు సిరి హన్మంతు, జస్వంత్ పాదాల, మానస్ నాగులపల్లి, ఆర్ జే కాజల్, వీజే సన్నీ, యాంకర్ రవి, ప్రియాంక సింగ్(Priyanka Singh), విశ్వ, అని మాస్టర్, శ్రీరామ చంద్ర నామినేట్ అయ్యారు.
ఆసక్తికర ఎలిమినేషన్: గేమ్ లో, టాస్క్ లో ఎంతో బాగా ఆడి బిగ్ బాస్ లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్నాడు విశ్వ. అలాంటి విశ్వ తొమ్మిదో వారానికి ఎలిమినేట్ అయ్యాడని తాజా గా జరుగుతున్న లీకుల ద్వారా తెలిసిపోయింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లోనే బెస్ట్ పరఫార్మర్ గా నిలిచి 3 స్టార్లను గెలుచుకున్నాడు.
కొంప ముంచిన పింకీ: సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో కేవలం ఒక ఓటు తో నామినేట్ అయ్యి అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక గేమ్ బాగా ఆడుతున్న విశ్వ ఎలిమినేట్ అవ్వడం హౌస్ లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎట్లయితేనేం పాపం విశ్వ తొమ్మిది వారాలు ఉండి ప్రేక్షకులని అలరించాడు. ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుందాం.
Also Read: తొమ్మిదో వారం ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్