Mass Jathara movie: రవితేజ అప్ కమింగ్ మూవీ ఆగిపోయిందన్న న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు తెరలేపింది. రవితేజ కారణంగానే ఈ సినిమా సమస్యల్లో పడింది అంటున్నారు. ఈ క్రమంలో ఆ సినిమా దర్శకుడికి భారీ షాక్ తగిలినట్లు అయ్యింది. ఇంతకీ మేటర్ ఏంటంటే?
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. కొన్నాళ్లుగా రవితేజ విజయాల శాతం పడిపోతూ వస్తుంది. గత ఐదేళ్లలో రవితేజ నటించిన క్రాక్, ధమాకా మాత్రమే హిట్. ధమాకా అనంతరం రవితేజ చేసిన ఒక్క చిత్రం ఆడలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్ బచ్చన్ అయితే అభిమానులకు సైతం నచ్చలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండాలని రవితేజకు ఫ్యాన్స్ సలహాలు ఇచ్చారు.
Also Read: కూలీ’ హైప్ ని అమాంతం పెంచేసిన పూజా హెగ్డే..యూట్యూబ్ ని ఊపేస్తున్న ‘మౌనిక’ పాట!
బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ నేపథ్యంలో రవితేజ మార్కెట్ దెబ్బతింది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఒక హీరో రెమ్యూనరేషన్ ఆయన సినిమాల మార్కెట్ ఆధారంగా నిర్ణయిస్తారు. రవితేజకు గతంలో ఇచ్చినంత రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని టాక్. అయితే రవితేజ మాత్రం తన రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు ఇష్టపడటం లేదట. ఈ కారణంగానే తన 76వ చిత్రం ఆగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమలతో రవితేజ తన 76వ చిత్రం ప్రకటించారు.
జూన్ లో పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రాన్ని చకచకా పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాడట. అందుకు రవితేజ రెమ్యూనరేషనే కారణం అట. ప్రస్తుతం రవితేజ భాను బోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఇది రవితేజ 75వ చిత్రం కాగా ఆగస్టులో థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని నిర్మాత భావిస్తున్నాడట. మాస్ జాతర విజయం సాధించిన నేపథ్యంలో అడిగినంత ఇచ్చి రవితేజతో మూవీ చేస్తాడట.
Also Read: ఫైరింగ్ పూర్తి అయ్యింది..’ఓజీ’ నుండి అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!
ఈ పరిణామాలతో దర్శకుడు కిషోర్ తిరుమల నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నేను శైలజ చిత్రంతో హిట్ కొట్టి పరిశ్రమను ఆకర్షించిన కిషోర్ తిరుమలకు మరో హిట్ దక్కలేదు. ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి పర్వాలేదు అనిపించాయి కానీ… కమర్షియల్ గా ఆడలేదు. ఇక రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు ప్లాప్ ఖాతాలో చేరాయి. ఈ సమయంలో రవితేజ వంటి స్టార్ తో మూవీ చేసే ఛాన్స్ రావడం గొప్ప అవకాశం. కానీ అది చేజారితే కిషోర్ తిరుమలకు షాక్ తప్పదు.