Telangana New Ration Card : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రజా పాలన దరఖాస్తులో భాగంగా రేషన్ కార్డు లేని వారు దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే కుటుంబంలో కొందరు వేరుగా కార్డు తీసుకునేందుకు అప్లై చేసుకున్నారు. ఇలా కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గతంలోనే అర్హులైన వారందరికీ కొత్త కార్డులను చారి చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది మాన్యువల్ గా దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో అప్లికేషన్ స్టేటస్ చూపించలేదు. ఆ తర్వాత మరోసారి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డు అప్రూవ్ అయింది. అయితే ఇప్పటికే కొంతమంది ఆన్లైన్ ద్వారా కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు. అధికారికంగా జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
Also Read : కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్టేట్
గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు జారీ చేయలేదు. వీటితోపాటు కొత్తగా పేర్లు నమోదు చేయడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన వారి నుంచి రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరించింది. అయితే కొన్నాళ్లపాటు అనర్హుల పేర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా కొందరు రేషన్ కార్డులో పేర్లు ఉండి మూడు నెలలపాటు బియ్యం తీసుకొని వారి పేర్లను సైతం తొలగించింది. ఈ క్రమంలో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులను అందించాలని ఉద్దేశంతో అధికారులు రేషన్ కార్డుల ప్రక్రియలో ప్రక్షాళన చేపట్టారని ప్రజాప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుతం రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి అయ్యిందని.. నిజమైన లబ్ధిదారులకే రేషన్ కార్డులను అందించామని చెబుతున్నారు. ఇందులో భాగంగా జులై 14న తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. అయితే ఇప్పటికే చాలామంది ఆన్లైన్లో అప్రూవ్ అయినవారు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది తమ కార్డు అప్రూవ్ అయిందా? లేదా? అనే సందేహం ఉంది. ఇలాంటివారు ఆన్లైన్లో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు.
Also Read : తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఏడాదికి రూ.2 లక్షలు
కొత్త రేషన్ కార్డు తమకు అప్రూవ్ అయిందా లేదా అని మొబైల్ లోనే ఇలా చెక్ చేసుకోవాలి. ముందుగా Google లోకి వెళ్ళాలి. ఇక్కడ FSC search అని టైప్ చేయాలి. ఇప్పుడు ముందుగా వచ్చే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. తెలంగాణ రేషన్ కార్డు సంబంధించిన website ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన నెంబర్ గుర్తుంచుకోవాలి. ఓపెన్ అయిన వెబ్సైట్లో మీసేవ నెంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీసేవ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏ జిల్లా వారు వారి జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెర్చ్ అని క్లిక్ చేయగా రేషన్ కార్డుకు సంబంధించిన స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ మీ సేవ నెంబర్ అందుబాటులో లేకపోతే FSC Aadhar Card search అని టైప్ చేయాలి. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో కుటుంబ యజమాని ఆధార్ కార్డు లేదా ఎవరి పేర్లు అయితే నమోదు చేసుకున్నారు వారి ఆధార్ కార్డు నెంబర్ ఆప్షన్ ఉన్నచోట ఎంట్రీ చేయాలి. ఇక్కడ కూడా తమకు సంబంధించిన జిల్లా పేరును సెలెక్ట్ చేసుకుని సెర్చ్ చేయాలి. ఇప్పుడు వారికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది.