https://oktelugu.com/

Mohan Babu: ఇద్దరు హీరోలు ఎవరయ్యా మోహన్‌ బాబు ?

Mohan Babu:  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి రాబోయే చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ పై ఎలాంటి అంచనాలు లేవు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ మాత్రం ఓపెనింగ్స్ వచ్చేలా కనబడటం లేదు. దాంతో మోహన్ బాబు కాస్త నిరుత్సాహంలోకి గురి అయినట్టు తెలుస్తోంది. ఆ నిరుత్సాహంలో తాను ఏమి మాట్లాతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఏమి మాట్లాడాడో చూద్దాం. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ చేయిస్తున్నారంటూ కలెక్షన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 17, 2022 / 03:19 PM IST
    Follow us on

    Mohan Babu:  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి రాబోయే చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ పై ఎలాంటి అంచనాలు లేవు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ మాత్రం ఓపెనింగ్స్ వచ్చేలా కనబడటం లేదు. దాంతో మోహన్ బాబు కాస్త నిరుత్సాహంలోకి గురి అయినట్టు తెలుస్తోంది. ఆ నిరుత్సాహంలో తాను ఏమి మాట్లాతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఏమి మాట్లాడాడో చూద్దాం.

    Mohan Babu

    కొందరు కావాలనే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ చేయిస్తున్నారంటూ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆరోపించారు. ‘సెలెబ్రిటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ చూసి చాలా బాధ పడుతున్నా. నేను సాధారణంగా వాటిని పట్టించుకోను. కానీ కొంతమంది అదే పని మీద ఉంటారు. ఇద్దరు హీరోలు కొందరిని అపాయింట్ చేసుకుని ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఏదో ఒకరోజు వాళ్లకు శిక్ష తప్పదు’ అని అన్నారు. అయితే ఆ ఇద్దరు ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

    Also Read: CM Jagan: స‌వాళ్లు విసిరిన వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుంటున్న జ‌గ‌న్‌.. మిగిలింది అదొక్క‌టే..!

    మరి మోహన్ బాబు చెప్పినట్టు ఎవరో ఇద్దరు హీరోలు ఇదంతా చేయిస్తున్నారు అనుకుందాం. అయితే మంచు ఫ్యామిలీ పై గతంలో కూడా అనేక రకాలుగా ట్రోల్ చేశారు. మరి అప్పుడు ఎవరు ట్రోల్ చేయించారు. అప్పుడు మాత్రం ఆ ఇద్దరు హీరోలు చేయించలేదు. ఎందుకంటే ఆ ఇద్దరు హీరోలు అప్పుడు మోహన్ బాబుకి సన్నిహితులు. ఇప్పుడు మాత్రం వీరి మధ్య చిన్న స్పర్ధలు వచ్చాయి.

    Mohan Babu

    అందుకే.. మోహన్ బాబు ఆ ఇద్దరి హీరోల పై అనేక ఆరోపణలు చేస్తున్నాడు. ఇక తన సన్నాఫ్ ఇండియా మూవీ విశేషాలను మోహన్ బాబు మీడియాతో పంచుకునే క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఈ చిత్రం యువతరంతో పాటు అందరికీ నచ్చుతుంది. కథ అవసరం మేరకు ఇద్దరు అమ్మాయిల మధ్య ముద్దు సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

    Also Read: ఛీ.. ఎక్స్ పోజింగ్ గురించి నువ్వా మాట్లాడేది ?

    Tags