Senior NTR-Jagan: తనకు వ్యతిరేకంగా ఉన్న వారితోనే పొగిడించుకోవడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఆయనకు అవసరం అనుకుంటే.. ఎవరినైనా దగ్గరకు తీసుకుంటారు. కాగా ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ మీద ఎనలేని ప్రేమను కురిపిస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఎన్టీఆర్‌కు ప్రజల్లో ఉన్న అభిమానం గురించి జగన్‌కు తెలుసు. ఆ పేరుకు ఉన్న ఇమేజ్‌ను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం కొడాలి నానిని రంగంలోకి దించారు.
నాని ఇప్పటికే నిమ్మకూరులో ఉన్న నందమూరి కుటుంబ సభ్మయులను కొందరిని జగన్ వద్దకు తీసుకెళ్లారు. కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టడంపై జగన్‌కు ధన్యవాదాలు కూడా చెప్పించారు. ఇదంతా రాజకీయంగా వేసిన అడుగుల్లో భాగమే. 2023లో ఎన్టీఆర్‌కు వందో జయంతి జరుగుతుంది. కాబట్టి దాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసి సానుభూతి కొట్టేయాలని ప్లాన్ వేస్తోంది వైసీపీ. ఇందులో భాగంగా.. నిమ్మకూరులోని చెరువులో ఎన్టీఆర్ ది కాంస్య విగ్రహం పెట్టేందుకు ప్లాన్ చేసింది.
పైగా దీన్ని జగన్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి.. తమకు ఎన్టీఆర్ మీద ఎంతో ప్రేమ అని చాటిచెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆ క్రెడిట్‌ను కొట్టేసింది. ఇప్పుడు కాంస్య విగ్రహాన్ని పెట్టి ఎన్టీఆర్ అభిమానుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేస్తోంది. అయితే ఆయన్ను నిమ్మకూరుకే పరిమితం చేయాలనే ప్లాన్ కూడా ఇందులో భాగమే.
Also Read: సవాళ్లు విసిరిన వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్న జగన్.. మిగిలింది అదొక్కటే..!
ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేస్తే.. వైసీపీ ఫ్యామిలీకి ఉన్న ఓట్లు దూరం అవుతాయనే భయంతో.. కేవలం కృష్ణా జిల్లా వరకే ఈ సంబురాలు చేయాలని చూస్తున్నారంట. కృష్ణా జిల్లా వరకే సెలబ్రేట్ చేసినా.. కూడా రాష్ట్రం మొత్తం పాజిటివ్ వేవ్‌ను సృష్టించుకునే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. అంటే నారా వారి కుటుంబం ఎన్టీఆర్‌కు ఏం చేయలేదని, తామే అన్నీ చేస్తూ ఆయన వారసులం అనిపించుకుంటున్నామని చెప్పే ప్రయత్నం అన్న మాట.
మరి వాస్తవంగా నందమూరి కుటుంబ సభ్యులు అయిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లను ఇందుకు ఆహ్వానిస్తారా లేదా అన్నదే అనుమానం. కుటుంబ సభ్యులను పక్కన పెట్టేసి సంబురాలు జరిపినా అనేక విమర్శలకు తావిచ్చినట్టే అవుతుంది. మరి జగన్ తన వ్యూహానికి ఎలా పదును పెడుతారో వేచి చూడాలి.
Also Read: ఏపీకి పాకిన హిజాబ్.. బెజవాడలో కలకలం