prabhas radhe shyam movie: మరో పది రోజుల్లో రాధేశ్యామ్ రానుండగా చిత్ర బృందం ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకోగా, మార్చ్ 2న ముంబైలో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ లో 2వ ట్రైలర్ వదులుతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి రాజమౌళి కూడా జత కలిశారు. ముఖ్య ఘట్టాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మరో విషయం ఏంటంటే, తన బీజీఎంతోనే 50% విజయాన్ని అందించే తమన్, క్లైమాక్స్‌లో అదిరిపోయే బీజీఎం ఇచ్చాడట.
కాగా రాధేశ్యామ్‌లో వరల్డ్‌లోనే ఫేమస్ పామిస్ట్‌గా ప్రభాస్ కనిపించనున్న విషయం తెలిసిందే. చిత్ర బృందాల సమాచారం మేరకు, లండన్ ఫేమస్ పామిస్ట్ విలియమ్ జాన్ వార్నర్ జీవిత కథ ఆధారంగా రాధేశ్యామ్‌ని మలచినట్టు తెలుస్తోంది. అతడు భారత్‌లో జాతకం చెప్పడం నేర్చుకొని, లండన్‌లో ఫేమస్ అయ్యాడు. రాధేశ్యామ్ కథ అధిక భాగం 1970ల్లో జరుగుతుండగా, చివరి అరగంట చాలా ఆసక్తిగా సాగుతుందని సమాచారం.
Also Read: బాలయ్య పెండ్లి పత్రికను చూశారా.. అప్పట్లోనే ఎంత రిచ్ గా ఉందో..!
ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాటలు బాగా ఆకట్టుకోగా, యువన్ శంకర్ రాజా పాడిన ఈ రాతలే అనే పాట సూపర్ హిట్ అయింది. మొత్తమ్మీద ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. పూజా కూడా చాలా అందంగా కనిపించింది.
ఇక పరమహంస పాత్రలో కృష్ణంరాజు మెరిసారు. అన్నట్టు బాలీవుడ్ బిగ్ బి రాధేశ్యామ్ కు వాయిస్ ఓవర్ అందించారు. కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు