Homeఎంటర్టైన్మెంట్Mohan Babu Son Of India Collections: ప్చ్.. 47 ఏళ్ల సినీ కెరీర్...

Mohan Babu Son Of India Collections: ప్చ్.. 47 ఏళ్ల సినీ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాప్

Mohan Babu Son Of India Collections: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’ కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ను లెక్కేస్తే.. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్‌ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. 353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఓపెనింగ్స్ పరంగా భారీగా […]

Mohan Babu Son Of India Collections: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’ కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ను లెక్కేస్తే.. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్‌ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది.

Mohan Babu Son Of India
Mohan Babu Son Of India

353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఓపెనింగ్స్ పరంగా భారీగా నిరాశ పరిచింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. పైగా షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 2-3% వరకు మాత్రమే ఉంది.

Also Read:  చరణ్ ఎమోషనల్ ట్వీట్ పై ప్రశంసల వర్షం

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 11 లక్షల రేంజ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.

ఇక సెకండ్ డే కలెక్షన్స్ ను బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. చాలా చోట్ల ఒక్కరు కూడా టికెట్ బుక్‌ చేసుకోకపోగా, కొన్ని చోట్ల సింగిల్‌ డిజిట్‌ ఉంటున్నాయి.

Mohan Babu
Mohan Babu

ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్లు ఇలా ఉండే అవకాశం ఉంది :

నైజాం 2 లక్షలు,

సీడెడ్ 3 లక్షలు,

ఆంధ్రా : 2.5 లక్షలు,

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2 లక్షలు.

ఓవరాల్ గా మొత్తం రెండు రోజులకు గానూ వరల్డ్ వైడ్ గా 22 లక్షలను ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉంది.

ఓవరాల్ గా మోహన్ బాబు కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రం.

Also Read: ఊర మాస్ లుక్‌ లో బాలయ్య.. మళ్ళీ ఫ్యాన్స్ కు పూనకాలే !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper