https://oktelugu.com/

Balakrishna : బాలకృష్ణకు హీరోయిన్ గా మహేష్ సిస్టర్ చేయాల్సిన చిత్రం ఏమిటో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్ మంజుల, బాలకృష్ణ జంటగా ఒక మూవీ తెరకెక్కాల్సింది. దాదాపు కన్ఫర్మ్ అయిన ఈ కాంబో అనూహ్యంగా మిస్ అయ్యింది. వ్యతిరేకత కారణంగా వెనక్కి తగ్గారు. ఇంతకీ బాలకృష్ణకు జంటగా మంజుల చేయాల్సిన చిత్రం ఏమిటీ? అది ఎలా మిస్ అయ్యింది..

Written By:
  • S Reddy
  • , Updated On : December 13, 2024 / 08:47 AM IST

    Balakrishna-Manjula Combination Movie

    Follow us on

    Balakrishna :  సూపర్ స్టార్ కృష్ణకు ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు కాగా… ఇద్దరు అబ్బాయిలు. కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. రమేష్ బాబు మొదట్లో పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ ఆయన గ్రాఫ్ మెల్లగా పడిపోతూ వచ్చింది. చివరికి నటుడిగా వెండితెరకు దూరం అయ్యాడు. 2022లో అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన మహేష్ బాబు సంచలనాలు చేశారు.

    1999లో రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ భారీ హిట్ కొట్టింది. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరిగా వెలుగొందుతున్నారు. కాగా మహేష్ సిస్టర్ మంజులకు పరిశ్రమలో రాణించాలనే కోరిక ఉంది. ఆమె హీరోయిన్ కావాలని ఆశపడ్డారు. మంజుల ఆసక్తి గమనించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెను హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయాలని భావించాడు.

    మ్యూజిక్ డైరెక్టర్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంతో దర్శకుడిగా మారాడు. మాయలోడు, నెంబర్ వన్, యమలీల, శుభలగ్నం చిత్రాలతో వరుస హిట్స్ కొట్టాడు. దాంతో బాలకృష్ణతో మూవీ చేసే ఆఫర్ ఆయనకు వచ్చింది. టాప్ హీరో టైటిల్ తో బాలయ్య-ఎస్వీ కృష్ణారెడ్డి కాంబోలో ఒక చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో సౌందర్య హీరోయిన్ గా చేసింది. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి మంజులను హీరోయిన్ గా అనుకున్నారట. కృష్ణతో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయనతో చెబితే సరే అన్నారట.

    మంజులను బాలకృష్ణకు జంటగా పరిచయం చేస్తున్నారన్న న్యూస్ తో కృష్ణ ఫ్యాన్స్ లో అసహనం మొదలైందట. వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారట. ఎన్టీఆర్-కృష్ణ ఫ్యాన్స్ మధ్య వార్ ఓ రేంజ్ లో ఉండేది. అలాగే ఎన్టీఆర్ తో కృష్ణకు మనస్పర్థలు, విబేధాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కృష్ణ ఫ్యాన్స్ బాలకృష్ణతో మంజుల నటించడానికి ఒప్పుకోలేదట. ఎస్వీ కృష్ణారెడ్డి ని కూడా అభిమానులు తిట్టారట. పరిస్థితి అదుపు చేయి దాటేలా ఉందని, కృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి ఆ ఆలోచన విరమించుకున్నారట.

    అయితే టాప్ హీరో డిజాస్టర్ అయ్యింది. ఎస్వీ కృష్ణారెడ్డికి టాప్ హీరో ఫస్ట్ ప్లాప్. కాగా మంజుల షో అనే ప్రయోగాత్మక చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈ మూవీలో రెండే పాత్రలు ఉంటాయి. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి.