MM Keeravani : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) వచ్చే నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటి వరకు తమ అభిమాన హీరోని ఎన్నడూ చూడని లుక్ లో, క్యారక్టర్ లో చూడబోతున్నాము అనే సంతోషం అభిమానుల్లో ఒక రేంజ్ లో ఉంది. ఏ ముహూర్తం లో ఈ సినిమాని ప్రారంభించారో తెలియదు కానీ, అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. వాటి అన్నిటిని తట్టుకొని నేడు ఈ చిత్రాన్ని విజయవంతం గా పూర్తి చేశారు. అయితే ఈ సినిమా నుండి రేపు మూడవ పాట విడుదల అవ్వబోతుంది. రేపు మధ్యాహ్నం ఒక భారీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ పాట ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.
Also Read : ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!
ఈ పాట పవన్ కళ్యాణ్ కి తెగ నచ్చేయడం తో నిన్న తన ఓజీ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకొని, ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి(MM Keeravani) ఇంటికి వెళ్లి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేసి సన్మానం చేసాడు. దానికి సంబంధించిన వీడియో ని మేకర్స్ విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ కీరవాణి తో మాట్లాడుతూ ‘మీరు నమ్మరేమో..ఈ పాటని నేను ఇప్పటి వరకు 50 సార్లు విని ఉంటాను. పౌరుషం లేని వాళ్లకు ఈ పాట ని వినిపిస్తే చాలు పూనకాలు వచ్చి ఊగిపోతారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో లో రేపు విడుదల అవ్వబోయే పాటలో చిన్న బిట్ సాంగ్ ని కట్ చేసి పెట్టారు. దీనికి అభిమానులు సోషల్ మీడియా లో ఊగిపోతున్నారు. ఈ రేంజ్ మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తుంటే థియేటర్స్ లో ఆడియన్స్ ఏమైపోతారో అంటూ ట్వీట్స్ వేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఇదే వీడియో లో పవన్ కళ్యాణ్ కీరవాణి తో మాట్లాడుతూ ‘ఆస్కార్ అవార్డు ఎక్కడ సార్’ అని అడగ్గా, కీరవాణి దానికి సమాధానం చెప్తూ ‘ఇక్కడ ఉంటే అది నన్ను డామినేట్ చేస్తుందని లోపల దాచి పెట్టాను సార్..మీ చేతుల మీదుగా ఆస్కార్ ని రెండవ సారి తీసుకోవాలని అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు కీరవాణి. అలా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆస్కార్ తీసుకుంటున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఇక పోతే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ శుక్రవారం నుండి మొదలు కాబోతున్నట్టు సమాచారం. కేవలం ప్రీమియర్స్ కి రెండు వేల షోస్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 9న జరిపించాలని చూస్తున్నారు.