War 2 : బాలీవుడ్ లో ఖాన్స్ మేనియా నడుస్తున్న సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకొని వాళ్ళతో ధీటైన బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టిన హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan). అదే విధంగా టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయంలో, మూతి మీద మీసాలు కూడా మొలవని వయస్సు లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తన అసాధారణమైన టాలెంట్ తో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగాడు. అలా రెండు ఇండస్ట్రీస్ లో తమ సత్తా చాటుకున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఇప్పుడు ‘వార్ 2′(War2 Movie) చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు మొదటి నుండి భారీగానే ఉన్నాయి. నేడు విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Also Read : ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!
నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేశారు. ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పిస్తాయని అభిమానులకు స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఈ చిత్రం లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో నటించబోతున్నాడు అనేది కూడా ఈ టీజర్ ని చూస్తే తెలుస్తుంది. #RRR తర్వాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉంది కానీ, హృతిక్ రోషన్ కి మొదటి నుండి ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్కెట్ ఉంది. ఆయన తన ప్రతీ సినిమాకు అందుకునే రెమ్యూనరేషన్ మన టాలీవుడ్ హీరోలకంటే ఎక్కువే ఉండేది. ‘వార్ 2’ లో కూడా హృతిక్ రోషన్ రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. హృతిక్ రోషన్ ఈ చిత్రం కోసం 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఎన్టీఆర్ 120 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్ సౌత్ సూపర్ స్టార్, సౌత్ నుండి వచ్చే ప్రతీ రూపాయి ఎన్టీఆర్ పేరు మీదనే ఉంటుంది. ఇక నార్త్ ఇండియా లో హృతిక్ రోషన్ రేంజ్ కూడా అదే తరహా లో ఉంటుంది. అదే విధంగా బాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్ ఎంత పెద్దదో మన అందరికీ తెలిసిందే. అందుకే హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. అంటే ‘వార్ 2’ చిత్రానికి ఆయన సాధారణంగా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే తీసుకున్నాడు అన్నమాట. ఈ సినిమా భారీ హిట్ అయితే ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో బలమైన మార్కెట్ ఏర్పడుతుంది. అప్పుడు ఆయన ఖాన్స్ ని డామినేట్ చేసే స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ‘వార్ 2’ టీజర్ నుండి ఎన్టీఆర్ డైలాగ్ లీక్..ఈ రేంజ్ లో ఉందేంటి బాబోయ్!