Akkineni Nagarjuna : నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో టాప్ 4 లో ఒకరిగా రెండు దశాబ్దాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొనసాగిన అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ప్రస్తుతం తన తోటి సీనియర్ హీరోలతో పోలిస్తే బాగా వెనకబడ్డాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ వాస్తవాన్ని విస్మరించట్లేదు. రీసెంట్ గా విడుదలైన ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంత పెద్ద హిట్ కొట్టినా అక్కినేని ఫ్యాన్స్ లో సంతృప్తి లేదు. ఎందుకంటే ఈ చిత్రం లో హీరో నాగార్జున కాదు కాబట్టి. కేవలం ఒక ముఖ్య పాత్ర చేశాడంటే.
Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన శేఖర్ కమ్ముల ‘కుబేర’..ఎందులో చూడాలంటే!
తమిళ హీరో ధనుష్ తన అద్భుతమైన నటనతో మన తెలుగు ఆడియన్స్ ని మంత్రముగ్దులను చేశాడు. అందుకే నాగార్జున సోలో హీరో గా భారీ హిట్ కొట్టాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఆ భారీ హిట్ కేవలం వందవ సినిమాతోనే సాధ్యపడుతుందని ఆశపడ్డారు. కానీ డైరెక్టర్ ని చూసి మళ్ళీ చల్లబడ్డారు. వందవ సినిమా అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి, పెద్ద స్టార్ డైరెక్టర్ తో నాగార్జున చేతులు కలుపుతాడేమో అని అనుకుంటే, తమిళంలో ఒకే ఒక్క సినిమా కి దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న కార్తీక్ ని ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు ఇది కూడా పోయినట్టే అని ఫిక్స్ అయిపోయారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలం అయ్యింది. గోవాలో రెండు వారాల భారీ షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేశారు. అయితే నాగార్జున ఇంతలోపే అభిమానులకు మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.
వివరాల్లోకి 2023 వ సంవత్సరం లో శశికుమార్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘అయోతి’ చిత్రం పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో గా శశికుమార్ కి కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాని రీమేక్ చేయడానికి నాగార్జున అమితాసక్తి చూపిస్తున్నాడట. దీని మీద రీసెంట్ గానే చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ చిత్రానికి కూడా తమిళ దర్శకుడినే నాగార్జున ఎంచుకున్నాడట. కార్తీక్ దర్శకత్వం వహించే సినిమా కంటే ముందుగా ఇదే ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగార్జున కెరీర్ లో మొట్టమొదటిసారి విలన్ క్యారక్టర్ చేసిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరో గా లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.