Honda City Hybrid: ఇండియన్ మార్కెట్‌లో హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ విర్టస్ కార్లకు గట్టి పోటీ ఇచ్చే హోండా సిటీ హైబ్రిడ్ కారు ధర ఏకంగా రూ.లక్ష వరకు తగ్గింది. హోండా ఈ కారుపై ఏకంగా రూ.95,000 ధర తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.20.85 లక్షల నుంచి రూ.19.89 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు కొనాలి అనుకునే కస్టమర్లు 2022లో మొదటిసారి ఈ కారును లాంచ్ చేసినప్పుడు ఉన్న ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ కారు వెర్నా, విర్టస్‌లతో పోటీ పడుతుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఏకైక హైబ్రిడ్ సెడాన్. ఇది దాదాపు 27 కి.మీ.ల మైలేజ్ ఇస్తుంది.
హోండా సిటీ హైబ్రిడ్, భారతదేశంలో పెద్ద ఎత్తున ఫుల్ హైబ్రిడ్ కారుగా లాంచ్ అయిన మొదటి కారు. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, అడ్వాన్సుడ్ i-MMD (ఇంటెలిజెంట్ మల్టీ-మోడ్ డ్రైవ్) సిస్టమ్ ఉన్నాయి. దీని వల్ల కారు 26.5 కిలోమీటర్ల వరకు అదిరిపోయే మైలేజీని ఇస్తుంది. ఫుల్ హైబ్రిడ్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లో కూడా నడపవచ్చు.
2022లో లాంచ్ అయిన సిటీ హైబ్రిడ్ ZX వేరియంట్‌లో ఈ సెగ్మెంట్లో మొదటిసారిగా కొన్ని ADAS ఫీచర్లు ఉన్నాయి. అవి లేన్-కీపింగ్ అసిస్ట్, అడెప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్. దీని డిజైన్‌లో ఉన్న స్పోర్టియర్ డిఫ్యూజర్, లిప్ స్పాయిలర్, e:HEV బ్యాడ్జింగ్లాంటివి దీనిని సాధారణ పెట్రోల్ మోడల్స్ నుండి కాస్త డిఫరెంటుగా చూపిస్తాయి.
Also Read: రోడ్డు మీద దుమ్ములేపే రూ.20లక్షల బైక్.. ఇండియాలో లాంచ్ దాని స్పెషాలిటీ ఇదే
ధర తగ్గడం వల్ల సిటీ హైబ్రిడ్, ఈ బడ్జెట్‌లో పెట్రోల్ కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మంచి ఆప్షన్‌గా మారింది. తక్కువ రన్నింగ్ ఖర్చుతో పాటు అడ్వాన్సుడ్ టెక్నాలజీ కావాలనుకునే కొనుగోలుదారులకు ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. రూ.19.89 లక్షల ధరతో సిటీ హైబ్రిడ్ ఇప్పుడు 2022లో లాంచ్ అయిన ధరల దగ్గరగా ఉంది. భారతదేశంలో హైబ్రిడ్ కార్లు నెమ్మదిగా పాపులర్ అవుతున్న సమయంలో ఈ ధర తగ్గింపు కంపెనీకి కచ్చితంగా లాభదాయకంగా మారొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
జూన్ 2025లో సెడాన్ సెగ్మెంట్లో హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ విర్టస్ , మారుతి సియాజ్ వంటి మోడళ్ల అమ్మకాలు పెద్దగా లేవు. తన సెగ్మెంట్లో తప్ప మరే హైబ్రిడ్ పోటీదారు లేకపోవడం, టయోటా హైబ్రిడ్ సెడాన్ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల, హోండా సిటీ హైబ్రిడ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుల్-హైబ్రిడ్ సెడాన్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.