https://oktelugu.com/

Mahindra Cars: ఎలన్ మస్క్ గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా కార్లు రెడీ..! ఇక వరల్డ్ లెవల్లో దబిడదిబిడే..

ఆటోమోబైల్ రంగంలో ప్రపంచ ఆధిపత్యం కోసం చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో చైనా కంపెనీలతో పాటు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ వంటివి ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2025 / 05:09 PM IST

    Mahendra-Cars

    Follow us on

    Mahindra Cars: ఆటోమోబైల్ రంగంలో ప్రపంచ ఆధిపత్యం కోసం చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో చైనా కంపెనీలతో పాటు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిని ఢీకొట్టేందుకు భారత్ రెడీ అవుతోంది. భారత్ కు చెందిన కార్ల కంపెనీలు ప్రపంచస్థాయిలో ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులను మన్ననలను పొందుతోంది. ఇందులో భాంగా Mahindra Company ఇప్పటికే పలు దేశాల్లో వివిధ మోడళ్లను రిలీజ్ చేసింది. రానున్న రోజుల్లో మరికొన్ని ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లోకి తీసుకొచ్చి టెస్లా, చైనా కంపెనీలకు పోటీగా నిలవబోతుంది. అయితే వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు రెండు కార్లను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఆ కార్లు ఏవంటే?

    SUV కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రాకు మించిన కంపెనీ లేదని కొందరు ఆటోమోబైల్ రంగ నిపుణులు పేర్కొంటారు. ఈ కంపెనీ కార్లు కాస్త ఖరీదు ఉన్నా… నాణ్యతలో మాత్రం రాజీలేదంటారు. అందుకనే మహీంద్ర కార్ల కోసం ఎగబడుతూ ఉంటారు. ఇండియాలోనే కాకుండా కొన్ని దేశాల్లో మహీంద్రా కార్లు జగజ్జేతగా నిలిచాయి. ఇప్పటి వరకు మహీంద్రా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మొరాకో, చిలీ వంటి దేశాల్లో కార్లను తీసుకెళ్లి స్థానిక కంపెనీకు గట్టి పోటీ ఇస్తోంది.

    లేటేస్టుగా Mahindra XUV700, Scorpio N, XUV 3XO వంటి మోడళ్లు పరిచయం చేయాలని చూస్తోంది. ఇటీవల మహీంద్రా నుంచి XEV 9e, BE6 వంటి మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి రూ.21.90 లక్షల నుంచి రూ.30.50 లక్షల ప్రారంభ ధరతో ఉన్నాయి. ఈ మోడళ్లు ప్రపంచస్థాయిలోకి వస్తే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వీటిని మార్కెట్లోకి తీసుకురావడానికి మహీంద్రా కంపెనీ ప్రత్యేకంగా రూ. 16,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

    ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మహీంద్రా కార్లు ప్రాధాన్యత చాటుకుంటుండగా.. ఇప్పడు కొత్తగా మరికొన్ని కార్లను మార్కెట్లోకి తీసుకురావడంతో ఒక రకంగా చైనా కంపెనీలకు వణుకు పుడుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే చైనాకు చెందిన BYD మోడల్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అయితే ఇప్పుడు మహీంద్రాకు చెందిన XEV 9e, BE6 లను ప్రతి నెలా అంతర్జాతీయ స్థాయిలో విక్రయించాలని చూస్తోంది. ఈ మేరకు ప్లాంట్ లో 90 వేల యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

    ప్రపంచమంతా ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మహీంద్రా ఎస్ యూవీలతో పాటు ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆటోమోబైల్ రంగంలో మహీంద్రా వరల్డ్ చాంపియన్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా 2023లో మహీంద్రా గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ స్కీంను ప్రారంభించింది. దీనిని 2027లో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కుడి చేతి డ్రైవ్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీని తీసుకురానున్నారు. మొదటగా దీనిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టి ఆ తరువాత విదేశీ రోడ్లకు పరిచయం చేయనున్నారు.