Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…నిజానికి ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ప్రతి స్టార్ హీరోతో సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందు సాగుతున్నాడు. ఇక ఆయన నుంచి వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ అయినప్పటికి కేవలం 400 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబడుతున్నాయి. ఇతర దర్శకుల సినిమాలు వేల కోట్లలో కలెక్షన్స్ ను రాబడుతుంటే అనిల్ సినిమాలు మాత్రం చాలా తక్కువ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాయనే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇక అనిల్ రావిపూడి స్టార్ట్ డైరెక్టర్ గా మారకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన లైట్ వెయిట్ సినిమా కథలతో సినిమాలను చేస్తాడు. కామెడీ ఫ్యామిలీ జానర్లను నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ముందుకు సాగడం లేదనేది వాస్తవం… ఒక వర్గం ప్రేక్షకులు అనిల్ రావిపూడి క్రింజ్ కామెడీతో సినిమాలు చేస్తాడు. కాబట్టి అతను స్టార్ హీరోలతో సినిమాలు చేయలేడు. ఆయన చేసిన కూడా అవిపెద్దగా సక్సెస్ లను సాధించాలేవనే ఉద్దేశ్యంతో ఆయన మీద క్రింజ్ సినిమాలుంచేస్తాడనే మార్క్ వేశారు.
ఆ క్రింజ్ కామెడీ వల్లే ఆయన అదే జోన్ లో ఉంటున్నాడు. దాన్ని దాటి స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్లడం లేదు… ఇక ఇప్పటికైనా ఆయన ఆ మిస్టేక్ ను సరిదిద్దుకొని ఒక వైల్డ్ స్టోరీ తో పాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్టయ్యే సినిమాలను చేస్తే బాగుంటుంది.
అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను చేసుకుంటూ అవే కథలతో రిపీటెడ్ గా ప్రేక్షకులను ఇబ్బంది పెడితే మాత్రం ఆయనకు ప్రస్తుతం ఉన్న కెరియర్ కూడా ఉండకపోవచ్చు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అయినప్పటికి ఆ సినిమా ఇప్పటివరకు 350 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది. లాంగ్ రన్ లో 400 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఇతర డైరెక్టర్లు చేసే సినిమాలు 800 నుంచి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతున్నాయి… ఇక ఇప్పటికైనా ఆయన తన ఫలితాలు మారిస్తేనే ఆయన రాజమౌళి సుకుమార్ సందీప్ రెడ్డి బంగాళా లాంటి స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోతారు లేకపోతే మాత్రం ఆయన సక్సెస్ను సాధించిన కూడా టాప్ డైరెక్టర్ గా మారే అవకాశాలైతే ఉండవు…