Bhairava Dweepam Sequel: నందమూరి నటసింహాం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అప్పట్లో నెంబర్ వన్ హీరోగా ఎదగడానికి అతను చిరంజీవికి చాలా వరకు పోటీనైతే ఇచ్చాడు. కానీ చిరంజీవి ఎప్పటికప్పుడు బాలయ్య ను డామినేట్ చేస్తూ ముందుకు సాగాడు. కొన్ని సందర్భాల్లో బాలయ్య సైతం చిరంజీవి సినిమాలకు పోటీ ని ఇచ్చి తన సినిమాలను సక్సెస్ చేసుకున్నాడు. వరుసగా నాలుగు సక్సెస్ లను అందుకున్నప్పటికి రీసెంట్ గా చేసిన ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు… ఇక బాలయ్య బాబు తను చేసిన సినిమాల్లో ఒక రెండు సినిమాలకు మాత్రం సిక్వెల్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అప్పట్లో ‘ఆదిత్య 369’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిచ్చిందనే చెప్పాలి…
ఆ సినిమాతోనే తెలుగులో టైమ్ ట్రావెల్ సినిమాలకు మంచి గిరాకీ పెరిగింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ పేరుతో ఒక సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ‘భైరవ ద్వీపం’ సినిమాకి సీక్వెల్ ని కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు నుంచి కొత్త జానర్ లో సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఇక బాలయ్య బాబు సైతం ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పీరియాడికల్ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది… బాలయ్య ఇమేజ్ ను రెట్టింపు చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక మీదట బాలయ్య చేయబోతున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. తన సినిమా సెలక్షన్ మొత్తాన్ని తన కూతురు తేజస్విని చూసుకుంటుంది. అందుకే ఆమె చాలా కథలను వింటూ బాలయ్య ఇమేజ్ కు తగ్గ కథలను మాత్రమే సెలెక్ట్ చేస్తుంది…