Ee Nagaraniki Emaindi 2: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది'(E Nagaraniki Emaindi). నేటి తరం యూత్ కి ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ చిత్రం. మొదటి రిలీజ్ లో ఈ చిత్రానికి థియేటర్స్ నుండి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రీ రిలీజ్ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రిలీజ్ లో వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ వచ్చాయి. దీనిని బట్టీ యూత్ ఆడియన్స్ ఈ సినిమాని ఓటీటీ లో ఏ రేంజ్ లో చూసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భం లో అంటాడు ‘నాకు ఎలాంటి పని లేనప్పుడు, బాగా బోర్ కొడుతున్న సమయంలో నేను చూసే సినిమా ఈ నగరానికి ఏమైంది’ అని ఒక ఈవెంట్ లో అంటాడు. దాదాపుగా యూత్ మొత్తం అదే చేస్తారు.
అందుకే రీ రిలీజ్ లో ఈ చిత్రానికి ఆ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి భాగం లో నటించిన నటీనటులే ఈ చిత్రం లో కూడా ఉంటారు. కానీ ఆ నలుగురి స్నేహితుల్లో ఒకడిగా నటించిన శ్రీనాథ్ మాగంటి మాత్రం ఈ సీక్వెల్ లో నటించడం లేదు. ఆయనకు బదులుగా సుశాంత్ రెడ్డి ని తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మూడు క్యారెక్టర్స్ లో ఎలాంటి మార్పు లేదు. విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేష్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్, అసలు ఆ నలుగురు లేకపోతే సినిమానే లేదు , దయచేసి ఎవరినీ మార్చకండి, పాత వాళ్ళతోనే చేయండి అని అంటున్నారు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి కూడా అదే ఆలోచన ఉంది. కానీ శ్రీనాథ్ మాగంటి ప్రస్తుతం అందుబాటులో లేడు. సినిమాలకు ఆయన గత కొంతకాలంగా దూరం గా ఉంటూ వస్తున్నాడు. అందుకే ఈ చిత్రం లో ఆయన నటించడం లేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ చిత్రాన్ని కూడా సురేష్ బాబు నే నిర్మిస్తున్నాడు. మొదటి భాగం లో హీరో విశ్వక్ సేన్ సినిమాల్లోకి అడుగుపెట్టి డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం తో ఉంటాడు. అందుకోసం తన స్నేహితులతో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేస్తాడు. రెండవ భాగం లో ఎట్టకేలకు విశ్వక్ సేన్ కి ఒక సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తుంది. అతని స్నేహితులు కూడా ఈ చిత్రం లో భాగం అవుతారు. ఈ క్రమం లో జరిగే సంఘటనల ద్వారా పుట్టే కామెడీ, మధ్యలో కొన్ని ఊహించని ట్విస్ట్స్ ఈ సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నాయట.