Varanasi Movie Updates: మహేష్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులు ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సోషల్ మీడియా ని షేక్ చేసేస్తున్నారు. మహేష్ అభిమానులు తమ హీరో సినిమాకు ఈ రేంజ్ హైప్ అవ్వడం జరిగి చాలా కాలమే అయ్యింది. తోటి హీరోలంతా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ పెద్ద రేంజ్ కి వెళ్తుంటే, మహేష్ మాత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తూ తన మార్కెట్ ని పోగొట్టుకుంటున్నాడు అనే బాధ అభిమానుల్లో గట్టిగా ఉండేది. కానీ ఇప్పుడు ‘వారణాసి’ తో కేవలం పాన్ ఇండియా మార్కెట్ ని మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ పై గురి పెట్టాడు మహేష్. రీసెంట్ గానే విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎలాంటి బ్రేక్ లేకుండా సాగిపోతూ ఉంది.
రాజమౌళి #RRR మూవీ షూటింగ్ సమయం లో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అందుకే ఆ సినిమా పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేలోపు మూడు సంవత్సరాలు అయ్యింది. కానీ ‘వారణాసి’ కి అంత సమయం పట్టే అవకాశం లేదని, ఈ ఏడాది లోనే టాకీ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోతుందని, కేవలం VFX వర్కులు మాత్రమే జరుగుతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శ్రీ రామ నవమి కానుకగా విడుదల చేద్దామని అనుకుంటున్నారు అంటూ ఫిలిం నగర్ లో వినిపించిన టాక్. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, వారణాసి చిత్రం వచ్చే ఏడాది వేసవి కి అసలు రావడం లేదని, కానీ 2027 లోనే ఆ చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు. మేకర్స్ కూడా ఈ సినిమా 2027 లోనే వస్తుందని ఒక ట్వీట్ వేశారు.
సమ్మర్ లో ఎందుకు రావడం లేదంటే ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం ఉండడం వల్లే అని సోషల్ మీడియా లో కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. స్పిరిట్ చిత్రం మార్చ్ 5 న విడుదల కాబోతుందని, ఆ చిత్రానికి కూడా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం వల్ల అనవసరమైన క్లాష్ కి వెళ్లకుండా, ‘వారణాసి’ ని వేరే మంచి డేట్ లో తీసుకొస్తే బెటర్ అని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఈ ఏడాది మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9 లోపు ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.