Ravi Teja: కొత్త డైరెక్టర్స్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉండే హీరోల లిస్ట్ తీస్తే, అందులో మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) పేరు ముందు వరుసలో ఉంటుంది. బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ ఇలా ఒక్కరా ఇద్దరా?, ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేసిన చరిత్ర ఆయనది. అప్పట్లో బాగా సక్సెస్ అయ్యాయి, కానీ ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడమే రవితేజ చేసిన పెద్ద తప్పు అయ్యింది. ఈ మధ్య కాలంలో ఆయన కెరీర్ లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడానికి కారణం కొత్త డైరెక్టర్స్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే రవితేజ 300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన ఒక క్రేజీ యంగ్ డైరెక్టర్ తో సినిమాని వదులుకోవాల్సి వచ్చిందట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, అనిల్ రావిపూడి నే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘ధమాకా’ మూవీ ప్రారంభం అయ్యే కొత్తల్లో రవితేజ వద్దకు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సబ్జెక్టు తో వెళ్ళాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. రవితేజ మార్క్ మాస్ + కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడట అనిల్ రావిపూడి. ఈ స్టోరీ రవితేజ కి బాగా నచ్చింది కానీ, అప్పటికే ఆయన వరుసగా నాలుగు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. ఇవి పూర్తి అయ్యాక చేద్దామని అన్నాడట రవితేజ. ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి బాలయ్య తో ‘భగవంత్ కేసరి’ చిత్రం చేసాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేసి ఏకంగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టాడు. ఏ నాలుగు సినిమాల కోసం అయితే రవితేజ అనిల్ రావిపూడి మూవీ ని వదులుకున్నాడో, ఆ నాలుగు సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి.
రవితేజ మార్కెట్ కి భారీ కన్నం వేసేలా చేశాయి ఈ నాలుగు సినిమాలు. ఒకవేళ రవితేజ ఒప్పుకొని అనిల్ రావిపూడితో సినిమా చేసుంటే, 300 కోట్ల గ్రాస్ సినిమా రవితేజ ఖాతాలో కూడా ఉండేదేమో అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రవితేజ క్రెడిబిలిటీ బాగా దెబ్బ తినింది. టాక్ వస్తే రవితేజ సినిమాకు జనాలు కదలకుండా ఉండడం గతం లో ఎప్పుడూ కూడా జరగలేదు. అలాంటిది ఈ సంక్రాంతికి విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా జనాలు థియేటర్స్ కి కదలలేదు. దీనిని బట్టీ ఆయన గత చిత్రాలు ఎంతటి ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘రాజా ది గ్రేట్’ అనే చిత్రం తెరకెక్కి భారీ కమర్షియల్ హిట్ గా నిల్చింది.