Homeఎంటర్టైన్మెంట్NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ అప్డేట్... వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్డ్

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ అప్డేట్… వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్డ్

NTR: ఎన్టీఆర్ లైన్ అప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ వార్ 2. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల ఈ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే ఆయన సైన్ చేసిన మరో చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. వార్ 2 చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఎన్టీఆర్ ఇంకా సెట్స్ లో జాయిన్ కాలేదు. విదేశాల్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేశారని సమాచారం. కాగా వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు యూనిట్.

యష్ రాజ్ ఫిలిమ్స్ ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఇప్పటికే ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. టైగర్, ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన మిగతా చిత్రాలు. వార్ 2 ఆరవ చిత్రంగా తెరకెక్కుతుంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ చిత్రం ఇది. అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా వార్ 2 విడుదల తేదీకి ముహూర్తం కుదిరింది. 2025 ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. వార్ 2 విడుదల అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ల జోష్ నింపింది. స్పై థ్రిల్లర్ లో ఎన్టీఆర్ ని చూడాలన్న వారి కల నెరవేరింది. అయితే వారు మరో ఏడాదిన్నర కాలం వేచి చూడాలి.

ఎన్టీఆర్ నటిస్తున్న దేవర 2024 ఏప్రిల్ 4న విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దేవర విడుదలైన ఏడాదికి వార్ మూవీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించనున్నారు. ఆ వెంటనే దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని సమాచారం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version