Brahmani: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో బాలకృష్ణ. ఈయన సినిమా థియేటర్లలో వస్తుందంటే చాలు హౌస్ ఫుల్ పక్కా. పండుగ సందర్బంగా రిలీజ్ అయిన.. నార్మల్ డేస్ లో రిలీజ్ అయిన బాలయ్య సినిమాకు ఉండే క్రేజే వేరు. వరుసగా మూడు సినిమాలు విజయం సొంతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నందమూరి బాలకృష్ణకే దక్కింది. ఈ స్టార్ హీరో సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోగా.. కోట్ల రూపాయల షేర్ ను కూడా కలెక్ట్ చేశాయి.
2023వ సంవత్సరం మొదట్లో సంక్రాంతి బరిలో దిగిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ ను అందుకుంది. ఇక రీసెంట్ గా దీపావళి సందర్భంగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక 2024లో రాబోతున్న బాలయ్య సినిమాలు పక్కా రూ. 100 కోట్ల షేర్ ను కలెక్ట్ చేస్తాయని ధీమాగా ఉన్నారు బాలయ్య అభిమానులు. ఇంత అదృష్టం ఎలా వచ్చింది? ఏ సినిమా తీస్తే ఆ సినిమా హిట్ పక్కా అవడం ఏంటి? అని కొందరి అనుమానం. అయితే బాలయ్యకు ఈ అదృష్టం బ్రాహ్మణి పుట్టిన తర్వాతనే వచ్చిందని విశ్లేషకులు అంటుంటారు. బ్రాహ్మణి పుట్టక ముందు కూడా బాలయ్య సినిమాలు విజయం సాధించినా.. బ్రాహ్మణి పుట్టిన తర్వాత అన్ని బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు దక్కాయని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
బ్రాహ్మణి జాతకం మంచి జాతకమని.. ఆమె వల్ల కుటుంబ సభ్యులకు కష్టాలు తగ్గే అవకాశంతో పాటు అనుకూల ఫలితాలు ఎక్కువగా వచ్చాయని అంటుంటారు. ఇదిలా ఉంటే బాలయ్య పొలిటికల్ కెరీర్ కంటే ఎక్కువగా సినీ కెరీర్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే 2024 సంవత్సరం ఎన్నికల సమయం వచ్చే వరకు మరో సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో బాలయ్య లుక్ కూడా కొత్తగా ఉంటుందని సమాచారం అందుతోంది. కథల విషయంలో బాలయ్య ఎంత జాగ్రత్త తీసుకుంటారో.. అదే రేంజ్ లో ఫలితాలు కూడా ఉంటాయి.
బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కనున్న అఖండ 2 సినిమా కూడా ఘన విజయం సాధించి మంచి లాభాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య సినిమాలన్నీ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండడం గమనార్హం. అంతే కాదు సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ కూడా పెరుగుతుంది. దీంతో అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. మొత్తం మీద ఈ అదృష్టం మాత్రం బ్రాహ్మిణి వల్ల వచ్చిందని అనుకుంటున్నారు కొందరు.