Mind Blocking Twists: ఓ ఊహించని మలుపు ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తుంది. అనుకున్నట్లుగా కాకుండా కథ మలుపు తిరిగితే ప్రేక్షకులు ”ఏం ట్విస్ట్ రా బాబు” అంటూ ఫిదా అయిపోతారు. సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చేవి, చాలా బాగుంది అనిపించేవి ఈ ట్విస్టులే. ట్విస్ట్ సినిమాలో ఎక్కడ చోటు చేసుకున్నా ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. అసలు ఏమాత్రం ఊహించని ట్విస్ట్ క్లైమాక్స్ లో చోటు చేసుకుంటే ఆడియన్స్ గొప్ప అనుభూతికి లోనవుతారు. సినిమా మొత్తం కొంచెం అటూ ఇటూ ఉన్నా… ఓ బెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ స్వరూపం మార్చేస్తుంది. సూపర్ హిట్ టాక్ తో కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ మధ్య కాలంలో షాకింగ్ క్లైమాక్స్ ట్విస్ట్స్ తో మైండ్ బ్లాక్ చేసిన చిత్రాలేమిటో చూద్దాం..
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీతోనే అద్భుతం చేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అ!’ మూవీ క్లైమాక్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. వివిధ పాత్రలు తమ తమ నేపథ్యంలో సాగుతూ ఉంటాయి. చివరికి అవన్నీ కాజల్ పాత్రలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్ అని క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. ఈ ట్విస్ట్ సినిమాలో అదిరిపోయింది.

ఆర్ఎక్స్100 మూవీ ట్విస్ట్ కుర్రకారు మైండ్ బ్లాక్ చేసింది. చివరి వరకు ప్రేక్షకులు హీరోయిన్ పాయల్ తండ్రి పాత్ర చేసిన రావు రమేష్ ని విలన్ గా ఊహించుకుంటారు. అసలు విలన్ హీరోయిన్ పాయల్ అని క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. ఈ షాకింగ్ ట్విస్ట్ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచింది.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది కేరాఫ్ కంచరపాలెం. ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమమైన ట్విస్ట్ అని చెప్పాలి. సినిమా మొత్తం నాలుగు పాత్రలు, వాటి నేపథ్యంతో నడుస్తుంది. క్లైమాక్స్ లో మిగతా మూడు పాత్రలు భిన్న ఏజ్ గ్రూప్స్ లో రాజు జీవితంలో చోటు చేసుకున్న ఘటనలుగా దర్శకుడు రివీల్ చేస్తాడు. ఇది ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్.
విశ్వక్ సేన్ హీరోగా 2019లో విడుదలైన ‘హిట్’ మంచి విజయం సాధించింది. ఈ మూవీలో అసలు విలన్ అనేది సస్పెన్సు గా సాగుతుంది. చివరకు అనుక్షణం హీరోని వెన్నంటి ఉండే ఫ్రెండ్ విలన్ అని తేలుతుంది. సినిమాలో ఇది ఊహించని పరిణామం.

కామెడీ, సస్పెన్సు ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మంచి విజయం అందుకుంది. డెడ్ బాడీస్ మాఫియా కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో విలన్ ఎవరో పెద్ద డాన్ అయ్యుంటాడని ప్రేక్షకులు ఊహించుకుంటారు. చివరికి సామాన్యులైన ఓ తండ్రి కూతుళ్లు దీని వెనుక ఉన్నారనేది షాకింగ్ ట్విస్ట్.

ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఎవరు మూవీ ఒకటి. సినిమా ఆద్యంతం ట్విస్టులతో సాగుతుంది. అసలు విలన్ రెజీనా కాసాండ్రా నుండి నిజం రాబట్టడం కోసం పోలీసుగా వచ్చిన అడివి శేషు.. చివర్లో పోలీసు కాదని తేలుతుంది. ఎవరు మూవీ ట్విస్ట్ అద్భుతం అని చెప్పాలి.

Also Read: ధనుష్ – ఐశ్వర్య విడాకులకు కారణం అదే !
మత్తువదలా మూవీలో హీరో ఫ్రెండే విలన్ అనేది ఒక ట్విస్ట్ అయితే… క్లైమాక్స్ లో పాత 500, 1000 రూపాయల నోట్స్ రద్దు చేయడం షాకింగ్ ట్విస్ట్.
రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా ఉన్న రంగస్థలం మూవీ క్లైమాక్స్ ట్విస్ట్… ఎవరూ ఊహించనిది. సినిమా మొత్తం చిట్టి బాబు అన్నను చంపినవాడు ఊరి ప్రెసిడెంట్ పశుపతి అనుకుంటారు. కాని ప్రకాష్ రాజ్ అని తెలిసి… చిట్టిబాబు అతనికి సేవలు చేసి బ్రతికిస్తాడు. పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న ప్రకాష్ రాజ్ కి తాను చేసిన తప్పు చెప్పి చిట్టిబాబు చంపేస్తాడు. ప్రకాష్ రాజ్ అసలు విలన్ అనేది మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్

ఉప్పెన మూవీ ట్విస్ట్ సైతం ప్రేక్షకులను షాక్ కి గురిచేస్తుంది. నచ్చిన అమ్మాయి పక్కనే ఉన్నా హీరో ఆమెతో ఉండడానికి ఇష్టపడడు. తనతో లేచిపోయి వచ్చిన అమ్మాయిని తిరిగి పేరెంట్స్ కి అప్పగిస్తాడు. హీరో అలా ఎందుకు చేశాడనేది విలన్ విజయ్ సేతుపతి హీరోయిన్ కి క్లైమాక్స్ లో రివీల్ చేస్తాడు. బహుశా ఇలాంటి క్లైమాక్స్ తెలుగులో అయితే రాలేదు.

Also Read: ఎలక్ట్రిక్ కెటిల్ పాడైపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..!