Siri Hanumanthu : కరోనా సినిమా వాళ్ళకు పెద్ద సినిమా చూపిస్తోంది. చిన్నచితకా హీరోహీరోయిన్లను కూడా ఒక్కరినీ కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు కూడా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని సిరి తన సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. ‘ప్రస్తుతం నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఐతే, స్వల్ప లక్షణాలే ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది. ఇక సిరి అభిమానులు ఆమెకి మనో ధైర్యాన్నిస్తూ.. త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు పెడుతున్నారు.

మొత్తానికి కరోనా బారిన పడుతున్న , హీరోయిన్ల లిస్ట్ లో చేరింది సిరి. సిరిలో మంచి అభినయం ఉంది. ఇక అందం ఉంది. కానీ హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. చివరకు ఇలా కరోనా బాధితురాలిగా వార్తలకెక్కింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంది సిరి. సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయినా పాపం సిరికి అసలు టైం కలిసి రాలేదు.
సిరి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఏది ఏమైనా ఈ కరోనా మాత్రం ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న, శోభన ఇలా అందరూ కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అసలు ఊహించలేదు.
పైగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు.