Chandrababu corona: 70 ఏళ్ల వయసులో చంద్రబాబు కరోనా బారినపడ్డారు. వయసు పెరిగే కొద్దీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న కరోనా బారినపడ్డట్టు వెల్లడించారు. ఈరోజు ఆయన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా కరోనా సోకింది. ఈ థర్డ్ వేవ్ వేళ కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. మొదటి, రెండో వేవ్ ల నుంచి తప్పించుకున్న చంద్రబాబుకు ఈ మూడో వేవ్ లో కరోనా విడిచిపెట్టలేదు.

తాజాగా చంద్రబాబు తనకు కరోనా సోకిందని స్వయంగా తెలిపాడు. ఇప్పటికే లోకేష్ కరోనా బారినపడి హోం ఐసోలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు సైతం తాను కూడా హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపాడు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని చంద్రబాబు కోరారు. తండ్రీకొడుకులు ఒకేసారి కరోనా బారినపడడం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ నాయకులు ఇద్దరూ త్వరగా కోలుకోవాలని టీడీపీ నాయకులు , కార్యకర్తలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.
ఇప్పటికే కరోనా రోజురోజుకు తీవ్రమవుతోంది. ఏపీలో రోజుకు 5వేల కేసులను మించి నమోదవుతున్నాయి. పలు రంగాల ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా చంద్రబాబు కూడా ఏపీలోని పల్నాడులో టీడీపీ కార్యకర్త మరణిస్తే పాడే మోశారు. బహుషా అక్కడే ఆయనకు వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. థర్డ్ వేవ్ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేలా లేదు. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది.
ఇక చంద్రబాబుతో కలిసి పర్యటించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కు కరోనా పాజిటివ్ గా తేలింది. తాజాగా ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన