Ghani Movie: ‘గని’ కోసం మిల్కీ బ్యూటీ.. ఎలాంటి పాత్రలో కనిపించనుందంటే?

Ghani Movie: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్​ నటిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ గని ఫ్యామిలీలోకి ఎంటరైంది. మిల్కీ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 22, 2021 12:56 pm
Follow us on

Ghani Movie: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి.

Ghani Movie

ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్​ నటిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ గని ఫ్యామిలీలోకి ఎంటరైంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మరి ఈ సినిమాలో తమన్నా పాత్ర ఎలా ఉండనుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. గతంలో ఓ తేదీ అనుకున్నప్పటికీ.. పలు కారణాలు వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది.

వరుణ్ టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముకుంద, కంచె, లోఫర్​, మిస్టర్​, ఫిదా, అంతరిక్షం, ఎఫ్​2 ఇలా చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది. కాగా, గని సినిమాలో తొలిసారి పూర్తిగా సిక్స్​ప్యాక్​తో పలకరించనున్నారు వరుణ్​. ఇటీవలే విడుదలైన గ్లింప్స్​లో ఆ పర్సనాలిటీ చూపించి మతి పోగొట్టాడు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా అలరించనున్నాడో తెలియాల్సి ఉంది.