https://oktelugu.com/

Health Tips Telugu: ఈ వ్యక్తులు పెరుగు తింటే విషంతో సమానమట.. శాస్త్రవేత్తల హెచ్చరిక?

Curd Side Effects:  మనలో చాలామంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. పెరుగు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పెరుగు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుందనే సంగతి తెలిసిందే. పెరుగు ద్వారా శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా వృద్ధికి అవసరమైన ప్రో బయోటిక్స్ ను పొందవచ్చు. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కొంతమంది పెరుగు తినకూడదని సూచనలు చేస్తున్నారు. లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు పెరుగు తినకూడదు. ఈ […]

Written By: , Updated On : December 22, 2021 / 09:33 AM IST
Follow us on

Curd Side Effects:  మనలో చాలామంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. పెరుగు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పెరుగు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుందనే సంగతి తెలిసిందే. పెరుగు ద్వారా శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా వృద్ధికి అవసరమైన ప్రో బయోటిక్స్ ను పొందవచ్చు. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కొంతమంది పెరుగు తినకూడదని సూచనలు చేస్తున్నారు.

లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు పెరుగు తినకూడదు. ఈ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు పెరుగు తినడం ద్వారా అతిసారం లేదా కడుపునొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమస్యలతో బాధ పడేవాళ్లు పెరుగుతో పాటు పాల సంబంధిత ఉత్పత్తులకు సైతం దూరంగా ఉండాలి. శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమాతో బాధ పడేవాళ్లు పెరుగుకు దూరంగా ఉంటే మంచిది.

Also Read: మత్స్యకారులకు కేంద్రం శుభవార్త.. రూ.3 లక్షల లోన్ పొందే ఛాన్స్!

చలికాలంలో ఆస్తమాతో బాధ పడేవాళ్లు పెరుగు తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. పెరుగు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అయితే అసిడిటీ సమస్యతో బాధ పడేవాళ్లు మాత్రం పెరుగు తినకూడదు. అసిడిటీతో బాధ పడేవాళ్లు పెరుగు తింటే అజీర్ణం సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుంది. రాత్రి సమయాలలో కూడా పెరుగుకు దూరంగా ఉంటే మంచిది.

పెరుగు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో పెరుగు తోడ్పడుతుంది. అయితే అర్థరైటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు మాత్రం పెరుగు తినకూడదు. పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

Also Read: హై బీపీతో బాధ పడుతున్నారా.. ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు ఇవే?

ఇవి కూడా చదవండి
1. కేసీఆర్ చాణక్య వ్యూహం.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు నయా ప్లాన్..
2. ప్రత్యేక హోదాపై ‘ఏపీ’ ఆశలు వదులుకున్నట్లేనా?
3. ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు… కృష్ణా, విజయనగరం జిల్లాలో ఎన్ని సీజ్ చేశారంటే
4. బిగ్​బాస్​ టైటిల్ విన్నర్​ సన్నీకి కరెంట్ షాక్​.. అసలేం జరిగిందంటే?