spot_img
Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia: వైట్ ట్రెండీ వేర్లో తమన్నా బోల్డ్ షో... టెంప్ట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia: వైట్ ట్రెండీ వేర్లో తమన్నా బోల్డ్ షో… టెంప్ట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia: తమన్నా జోరు మామూలుగా లేదు. అటు వెబ్ సిరీస్లు ఇటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రోజుల వ్యవధిలో రెండు బోల్డ్ వెబ్ సిరీస్లలో తమన్నా నటించింది. లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా నటించిన విషయం తెలిసిందే. అడల్ట్ కంటెంట్ డోస్ అధికంగా ఉండే లస్ట్ స్టోరీస్ సిరీస్ 1 గ్రాండ్ సక్సెస్ . సీజన్ 2 లో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ నటించారు. లస్ట్ స్టోరీస్ లో నటుడు విజయ్ వర్మతో తమన్నా శృంగార సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం. లస్ట్ స్టోరీస్ 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

అలాగే ప్రైమ్ లో ఓ సిరీస్ చేశారు. జీ కర్దా సీజన్ 2 లో నటించింది. ఇందులో ఏకంగా టాప్ లేకుండా బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించింది. స్టార్ డమ్ చేజారాక తమన్నా అడల్ట్ కంటెంట్ ట్లో నటించడం విశేషంగా మారింది. రెండు దశాబ్దాల కెరీర్లో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై రెచ్చిపోయి నటించింది లేదు. లిప్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాలకు దూరంగా ఉంది. ఇప్పుడేమో మొహమాటం లేకుండా నటిస్తుంది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా సిరీస్లకు తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సౌత్ లో కూడా ఆమె దూసుకుపోతుంది. ఆమె క్రేజ్ ఇంకా తగ్గలేదు. చిరంజీవికి జంటగా భోళా శంకర్ చిత్రం చేస్తుంది. బోళా శంకర్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనున్నారు. అలాగే రజనీకాంత్ కి జంటగా జైలర్ చిత్రం చేస్తున్నారు. ఇది కూడా ఆగస్టు నెలలో విడుదల కానుంది.

కాగా ఎట్టకేలకు ఎఫైర్ పై నోరు విప్పింది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానని ఒప్పుకుంది. లస్ట్ స్టోరీస్ 2 చిత్రీకరణలో విజయ్ వర్మకు దగ్గరయ్యానని ఇటీవల తమన్నా ఓపెన్ అయ్యింది. విజయ్ వర్మ నాకు రక్షణగా నిలబడతాడు, నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ల నుండి కాపాడతాడు. అతడు చాలా కేరింగ్ పర్సన్, అందుకే నేను ప్రేమించాను, దగ్గరయ్యానని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version