Venu Swamy
Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయన ఇద్దరు హీరోలు చనిపోతారని చెప్పడం అందరిలో గుబులురేపుతుంది. అలాగే ఓ హీరోయిన్ అనారోగ్యంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొకుంటుందని చెప్పుకొచ్చారు. వేణు స్వామికి మంచి క్రెడిబిలిటీ ఉంది. అతడు చెప్పేవి జరుగుతాయని, ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు. హీరోయిన్ రష్మిక మందాన ఈయన ప్రియ శిష్యురాలు. తరచుగా వేణు స్వామి ఆమె కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు.
అసలు వేణు స్వామి చెప్పడం వలనే కన్నడ హీరో రక్షిత్ శెట్టిని రష్మిక వదిలేసిందట. నిశ్చితార్థం అయ్యాక రష్మిక అతడికి బ్రేకప్ చెప్పింది. వేణు స్వామి మాట అంటే ఆమెకు అంత నమ్మకం. ఇటీవల మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకుంది. చివరికి బాలకృష్ణ కూడా నా కస్టమర్ అని వేణు స్వామి ఒక సందర్భంలో చెప్పారు.
అలాగే కొందరు హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఈ క్రమంలో ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ భయపెడుతున్నాయి. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు హీరోలు వివిధ కారణాలతో మరణిస్తారని ఆయన అంటున్నారు. 2026 నాటికి మిథున రాశి, వృశ్చిక రాశి కలిగిన స్టార్ హీరోలు కన్నుమూస్తారని అంటున్నారు. ఒకరు అనారోగ్యంతో మరొకరు ఆర్థిక ఇబ్బందుతో ఆత్మహత్య చేసుకుంటారని చెప్పాడు.
అలాగే మరొక స్టార్ హీరోయిన్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులపాలవుతుందని వేణు స్వామి చెప్పారు. వేణు స్వామి చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరనే చర్చ మొదలైంది. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే ఊహించి చెప్పారు. ఇటీవల ప్రభాస్ కి కూడా ఆయన ఓ సలహా ఇచ్చాడు. ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలు వదిలేసి చిన్న చిత్రాలు చేస్తే సక్సెస్ దక్కుతుందని చెప్పుకొచ్చాడు.