Adipurush Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రానికి మొదటి నుండి హైప్ వేరే లెవెల్ ఉండడం తో విడుదలకు ముందే మూడు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. దాంతో ఈ చిత్తానికి మూడు రోజుల్లోనే 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
హిందీ లో కూడా మొదటి మూడు రోజులు ఖాన్స్ సినిమాలతో పోటీగా వసూళ్లను రాబట్టింది. కేవలం హిందీ వెర్షన్ నుండే ఈ చిత్రానికి మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. అలా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా మూడు రోజులకు 150 కోట్ల రూపాయలకు షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇక సోమవారం నుండి వర్కింగ్ డేస్ కాబట్టి ఈ చిత్రానికి వసూళ్లు డ్రాప్ అవ్వొచ్చు అని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే కనీవినీ ఎరుగని రీతిలో 80 శాతం కి పైగా వసూళ్లు డ్రాప్ అయ్యాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రానికి నాల్గవ రోజు కేవలం నాలుగు కోట్లు రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. మూడవ రోజు దాదాపుగా తెలుగు స్టేట్స్ నుండి 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
హిందీ లో కూడా ఇదే పరిస్థితి, నాల్గవ రోజు ఈ చిత్రానికి అక్కడ కేవలం 8 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. మూడు రోజుల్లో ఒక రేంజ్ వసూళ్లను రాబట్టిన చిత్రం ఈ స్థాయిలో డ్రాప్ అవుతుందని వాళ్ళు కూడా ఊహించలేకపోయారట. మొత్తం మీద ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.