https://oktelugu.com/

Mehreen Pirzada: ఆఫర్స్ కోసం హద్దులు చెరిపేస్తున్న మెహ్రీన్… షార్ట్ మిడ్డీలో బోల్డ్ లుక్!

అనూహ్యంగా ఆ వివాహాన్ని ఆమె రద్దు చేసుకుంది. దీనిపై పలు పుకార్లు వినిపించాయి. మరలా కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్స్ తగ్గిన నేపథ్యంలో డిజిటల్ సిరీస్లు చేస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2023 / 01:19 PM IST
    Follow us on

    Mehreen Pirzada: మెహ్రీన్ కెరీర్ నెమ్మదించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా షార్ట్ మిడ్డీలో మైండ్ బ్లాక్ చేసింది. మెహ్రీన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి మెహ్రీన్ ని వెండితెరకు పరిచయం చేశాడు. 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్. నాని హీరోగా నటించాడు. అనంతరం మహానుభావుడు చిత్రంలో మరో హిట్ కొట్టింది. దీంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా చిత్రాలలో నటించింది.

    ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఎఫ్ 3 చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఎఫ్ 2. మళ్ళీ ఆమెకు పరాజయాలు ఎదురయ్యాయి. చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ, మంచిరోజులొచ్చాయి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆఫర్స్ వస్తున్నా ఆమె పెళ్ళికి సిద్ధమైంది. 2021లో భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడైన భవ్య బిష్ణోతో వివాహం అనడంతో లైఫ్ సెటిల్ అనుకున్నారు.

    అనూహ్యంగా ఆ వివాహాన్ని ఆమె రద్దు చేసుకుంది. దీనిపై పలు పుకార్లు వినిపించాయి. మరలా కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్స్ తగ్గిన నేపథ్యంలో డిజిటల్ సిరీస్లు చేస్తుంది. ఆమె డెబ్యూ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. ఇది పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నటించింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సిరీస్లో మెహ్రీన్ బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో హీటెక్కించింది. శృంగార సన్నివేశాల్లో నటించిన మెహ్రీన్ అని కథనాలు రావడంతో, ఆమె మండి పడ్డారు. అవి కథలో భాగంగా చేసిన రేప్ సన్నివేశాలు. శృంగారాలు సన్నివేశాలు ఎలా అవుతాయని ఆవేశం వ్యక్తం చేశారు. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

    మరోవైపు ఆఫర్స్ కోసం దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న మెహ్రీన్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. మెహ్రీన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మెహ్రీన్ తెలుగులో స్పార్క్, కన్నడలో ఓ చిత్రం చేస్తుంది. వీటి మీదే ఆశలు పెట్టుకుంది.