Mitchell Santner Catch: వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ ఆఫ్గనిస్తాన్ టీమ్ ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద న్యూజిలాండ్ ఘన విజయం సాధించడం జరిగింది.దీంతో న్యూజిలాండ్ టీమ్ వరుసగా ఈ టోర్నీ లో 4 వ విజయాన్ని అందుకుంది.ఇక దాంతో న్యూజిలాండ్ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ క్రమంలో మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీం కి ఈ మ్యాచ్ లో ఎదురు దెబ్బ తగిలింది.గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని ఓడించి మంచి జోష్ మీదున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లకి ఈ మ్యాచ్ తో న్యూజిలాండ్ టీమ్ చెక్ పెట్టింది.ఇక మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 6 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది.
అందులో హిల్ యంగ్ 54,లాతం 68, ఫిలిప్స్ 71 పరుగులు చేశారు. ఇంక దాంతో న్యూజిలాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది. ఇక దాంతో 289 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ టీం కి భారీ దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో గురుబాజ్ తొందరగా అవుట్ అయ్యాడు.ఇక అతనితో పాటుగా జద్రాన్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. అయితే జద్రాన్ బౌల్ట్ బౌలింగ్ లో స్క్వేర్ లెగ్ మీదుగా ఒక షాట్ ఆడగా జద్రన్ కొట్టిన బాల్ ని మిచెల్ సంట్నార్ గాల్లోకి ఎగిరి మరి పట్టుకోవడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఆ క్యాచ్ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతుంది.
ఇక ఈ మ్యాచ్ ని చూసిన క్రికెట్ అభిమానులు ఆ క్యాచ్ గురించి క్యాచ్ ఆఫ్ ది వరల్డ్ కప్ అని కొందరు కామెంట్ చేయగా,క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అవుతుంది అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు… ఇక జద్రాన్ తర్వాత టీంలో ఉన్న ప్లేయర్లందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో ఆఫ్గనిస్తాన్ టీమ్ 139 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడం జరిగింది.న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సంట్నార్,ఫెర్గుసన్ ఇద్దరూ చెరో 3 వికెట్లు తీయగా, ట్రంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. అలాగే రచన్ రవీంద్ర, మాట్ హెన్రీ తలో వికెట్ తీసుకున్నారు…ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్ వరుసగా నాలుగు విజయాలను సాధించి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ ని సొంతం చేసుకుంది.దాంతో ఇండియా సెకండ్ పొజిషన్ కి పడిపోయింది. ఇక ఇవాళ్ల ఇండియా బంగ్లాదేశ్ తో ఆడే మ్యాచ్ లో కనుక విజయం సాధిస్తే మళ్లీ ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్లి పోతుంది. ఇక న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్ ఇండియా తో ఈనెల 22 వ తేదీన ఆడబోతుంది.
ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే మ్యాచ్ జరిగేంత వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఈ టోర్నీ లో ఈ రెండు టీములు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు ముందుకు దూసుకెళుతున్నాయి కాబట్టి ఎవరు ఎవరిపైనవిజయం సాధిస్తారు అనేది చెప్పడం కష్టం…
Catch of the Tournament Mitchell Santner
This guy is special
-Timing of the Jump spot on
-Took similar vs Bairstow 2 months backpic.twitter.com/sDrkESKkLu#NZVsAfg #INDvsBAN #CWC23INDIA pic.twitter.com/n3e5Wzxn5I— ICT Fan (@Delphy06) October 18, 2023