Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : ఈమధ్య సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారైందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అవతల వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా, ఇష్టమొచ్చినట్టు గాసిప్స్ ని క్రియేట్ చేసి రేటింగ్స్ కోసం ఇంతకంటే దిగజారలేరు అని అనుకున్న ప్రతీసారి ఇంకా ఇంకా దిగజారిపోతున్నారు. సాధారణ నెటిజెన్స్ మధ్య రోజు ఎదో ఒక లొల్లి కచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది క్రియేట్ చేసే గాసిప్స్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్థాయి వ్యక్తులను కూడా బాధపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మ అంజనా దేవి(Anjana devi konidela) కి ఆరోగ్యం బాగాలేదని, ఆమెని తెల్లవారుజామున హాస్పిటల్ కి తరలించి తీసుకెళ్లారని, ఇలా మెగా అభిమానులను ఆందోళనకు గురి చేసే ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. బాగా వైరల్ అవ్వడంతో ఈ వార్త మెగాస్టార్ చిరంజీవి వరకు చేరింది. ఆయన స్పందించిన తీరు చూస్తుంటే మీడియా అతని మనస్సుని ఎంత గాయపర్చిందో అర్థం అవుతుంది.
ఆయన మాట్లాడుతూ ‘మా అమ్మ అంజనీ దేవి గారి ఆరోగ్యం క్షీణించిందని, కుటుంబ సభ్యులు ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేసారంటూ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో వచ్చిన వార్తలు నా దృష్టికి వచ్చాయి. రెండు రోజులుగా ఆమె కాస్త నలతగా ఉన్న విషయం వాస్తవమే, కానీ హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించాము, ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది, ఇంట్లో చలాకీగా తిరుగుతుంది. దయచేసి ఆమె ఆరోగ్యం పై మీ ఊహాజనిత నివేదికలు ప్రచారం చేయవద్దని అన్ని మీడియా చానెల్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అసలు ఇలాంటి వార్తలు పుట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి పై ఇలాంటి ప్రచారాలు చేయడం నేరం అంటూ గాసిప్ రాయుళ్ల పై మండిపడుతున్నారు.
ఇకపోతే రీసెంట్ గానే అంజనా దేవి గారి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులందరు ఎంత ఘనంగా జరిపించారో మనమంతా చూసాము. చిరంజీవి, రామ్ చరణ్, మనవరాళ్లు, ముని మనవరాళ్లు మధ్య ఆమె ఎంతో సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ(Vishwambhara Movie) షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది విడుదలైన టీజర్ తో గ్రాఫిక్స్ విషయంలో అత్యధిక ట్రోల్స్ నిే ఎదురుకున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ పరంగా ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయా అనేది రాబోయే ప్రమోషనల్ కంటెంట్స్ ద్వారా తెలియనుంది.