Shikhar Dhawan: “మొన్నటికి మొన్న నా కొడుకుకు దూరమయ్యాను.. అతడిని చూడక రెండు సంవత్సరాలు అయింది. మాట్లాడక ఏడాది గడిచింది. నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్నాను. ఇంతటి బాధ ఎవరికీ రాకూడదు. మానసికంగా వేదన అనుభవిస్తున్నానని” టీమిండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అందరూ అతనిపై సానుభూతి చూపించారు.
సరిగ్గా రెండు రోజులు గడిచాయో లేదో.. శిఖర్ ధావన్ ఓ అమ్మాయితో కనిపించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల భారత్ – బంగ్లాదేశ్ తలపడిన మ్యాచ్ కు అతడు హాజరయ్యాడు. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కి ముందు టీమిండియా క్రికెటర్లతో దవన్ కలియతిరిగాడు. ఆ తర్వాత వీఐపీ గ్యాలరీలో కూర్చుని.. మ్యాచ్ తిలకించాడు.
విదేశీ యువతితో..
మ్యాచ్ చూస్తున్నంత సేపు శిఖర్ ధావన్ పక్కన ఓ విదేశీ యువతి కనిపించింది. ధవన్ ఆ విదేశీ యువతి పక్కన కూర్చున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ ఫోటోలను ఉద్దేశించి నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. “ధావన్ పక్కన ఉన్న అమ్మాయి భలే ఉంది. అతడికి కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందని” కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆ అమ్మాయితో ధావన్ డేటింగ్ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ అమ్మాయి గురించి నెటిజన్లు ఆరా తీయగా.. సంచలనాత్మకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు సోఫీ షైన్ అని తెలుస్తోంది. ఆమెది ఐర్లాండ్ ప్రాంతమని.. ఆమెను ఇన్ స్టా గ్రామ్ లో శిఖర్ ధావన్ అనుసరిస్తున్నాడని తెలుస్తోంది. దీంతో సోఫీ, ధావన్ మధ్య ఏదో జరుగుతోందని ప్రచారం మొదలైంది. అయితే కొద్దిరోజుల క్రితం ఇదే ఇదే యువతితో కలిసి ధావన్ విమానాశ్రయంలో కనిపించాడు. ఆమె కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని.. వెస్ట్రన్ డ్రెస్ ధరించి కనిపించింది. శిఖర్ ధావన్ సూటూ బూటూ వేసుకొని దర్శనమిచ్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అతడిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీంతో అతడు టీమిండియా కంటే ముందే దుబాయ్ వెళ్లిపోయాడు. దుబాయ్ లో ఇటీవల బంగ్లాదేశ్- భారత్ తలపడిన మ్యాచ్ ను సోఫీ తో కలిసి వీక్షించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మొదట్లో వారిద్దరు కూర్చుని ఉన్న ఫోటోలను చాలామంది లైట్ తీసుకున్నారు. అయితే ఇద్దరు సోషల్ మీడియా ఎకౌంట్లలో పరస్పరం అనుసరించుకుంటున్న నేపథ్యంలో ఏదో జరుగుతోందని.. ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరుగుతున్నది. ” వారిద్దరూ చూడటానికి చాలా బాగున్నారు.. డేటింగ్ లో ఉన్నట్టు అనిపిస్తోంది. పైగా శిఖర్ కూడా ఆయేషా తో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే ఉంటున్నాడు.. బహుశా ఒంటరి జీవితం అంతటికి ఇబ్బంది అనిపించినట్టు ఉంది. అందువల్లే ఇలా ఒక తోడు వెతుకుంటున్నాడు. బహుశా త్వరలో పెళ్లి చేసుకుంటారేమోనని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Who is this lady with Shikhar Dhawan? #ShikharDhawan #IndvsBan #RohitSharma #ChampionsTrophy pic.twitter.com/JqFTeY4kAp
— lei (@sakshimadik03) February 20, 2025