Megastar Chiranjeevi: తెలుగులో చిరంజీవి పేరు తెలియని వారుండరు. అంతటి ఖ్యాతి సంపాదించుకున్న హీరో. స్వయంకృషితో ఎదిగిన చిరు కూడా ఎన్నో కష్టాలు పడినా చివరకు మాత్రం చిత్రసీమకు రాజయ్యారు. ఇప్పుడున్న వారిలో అందరికంటే వయసులో పెద్దగా పరిశ్రమకే పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో ఎంతో మంది తమ టాలెంట్ చూపించుకోవాలని వచ్చి దూసుకుపోతున్నారు. ఆయన అండ ఉన్నా వారి సొంత ప్రతిభ కూడా ఉంటేనే రాణిస్తారు. అలా వచ్చిన వారిలో నాగబాబు, పవన్ కల్యాణ్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్ వంటి వారు ఉండటం తెలిసిందే. కానీ ఇక్కడ ఇంకో క్యారెక్టర్ కూడా చెప్పుకోవాలి. అతడే ఆయన చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త కల్యాణ్ దేవ్.
చిరు పేరు చెప్పుకుని వచ్చిన వారిలో ఎంతో మంది తమ టాలెంట్ తో రాణిస్తున్నా కల్యాణ్ దేవ్ మాత్రం తన స్టామినా ప్రదర్శించలేకపోయారు. దీంతో ఆయన పేరు వినిపించలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా నువ్వు హీరోగా కాదు ప్రొడక్షన్, నిర్మాతగానైనా ప్రయత్నిస్తే బాగుంటుందని చెప్పారట. కానీ నటనపై ఉన్న మక్కువతోనే అతడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశాడట. కానీ చివరకు ఎలాంటి పేరు రాకుండానే పరిశ్రమ నుంచి నిష్ర్కమించడం తెలిసిందే.
Also Read: Rashmika Mandanna: శృతి మించిన రష్మిక అందాలు.. కేక పెట్టిస్తున్న ఘాటు పోజులు
సినిమాల్లో రాణించాలంటే ఎన్నో విధాలుగా మనలో వెరైటీలు ఉంటేనే సాధ్యమవుతుంది. అవి లేకుండా సినిమాల్లో పేరు తెచ్చుకోవడం కష్టమే. దీంతోనే చాలా మంది ఆదిలోనే పేరు రాకుండానే పెట్టా బేడ సర్దుకుంటున్నారు. సినిమాల్లో ఎదగాలంటే ప్రత్యేక ఆకర్షణలు చూపించాలి. మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. అలాంటి ఏదైనా ఓ ప్రత్యేకత ఉంటేనే సాధ్యమవుతుంది. అంతేకాని నేను సినిమాల్లో రాణించాలని ఎంతగా ఆశ పడినా కుదరదు. దానికి అదృష్ట కూడా కలిసి రావాలి.
తాజాగా చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరో అవ్వాలనే ఉద్దేశంతో వచ్చినా అతడికి కనీసం గుర్తింపు కూడా రాలేదు. ఎన్ని సినిమాల్లో నటించినా తనదైన గుర్తింపు మాత్రం చూపించలేకపోయాడు. దీంతో చిరంజీవి చెప్పిందే నిజమైంది. ఇండస్ట్రీకి నువ్వు పనికి రావని చెప్పినా వినిపించుకోకుండా వచ్చినా చివరకు నిరాశే మిగిలింది. పరిశ్రమలో రాణించాలంటే దానికి ఓ రేంజ్ ఉండాలి. ఓ స్టామినా కావాలి. తనదైన ముద్ర వేయాలి. అప్పుడే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. అంతే కానీ ఎవరు పడితే వారు హీరోలైపోరు. దానికి కఠోర శ్రమ కావాలి.
Also Read:Tollywood Heroes Disaster Movies: మన టాలీవుడ్ హీరోలు ఈ సినిమాలు చేయకుంటే బాగుండు..?