Chiranjeevi- Dil Raju: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో శెరవేగంగా సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి మార్కెట్ లో మాములు క్రేజ్ లేదు..ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ కథాంశం తో సినిమా చెయ్యడమే అందుకు కారణం..ఫాన్స్ కూడా ఎప్పటి నుండో మెగాస్టార్ ఊర మాస్ అవతారం లో చూడడానికి ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇక ట్రేడ్ లో కూడా ఈ సినిమాకి ఉన్న డిమాండ్ మామూలుది కాదు..ఇప్పటి నుండే ప్రాంతాల వారీగా ఈ సినిమా నిర్మాతలకు అడ్వాన్స్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు..సీడెడ్ లో 15 కోట్ల రూపాయలకు మరియు అమెరికా లో 7 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి..ఇక నైజాం మరియు ఆంధ్ర బిజినెస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ లో పోటీ మొదలైంది.
నైజాం లో ఈ సినిమాని 30 కోట్ల రూపాయలకు హోల్ సేల్ గా రైట్స్ మొత్తం దక్కించుకోవడానికి దిల్ రాజు రెడీ గా ఉన్నాడు..మైత్రి మూవీ మేకర్స్ కూడా అందుకు మొదట్లో ఒప్పుకున్నారు..అయితే సినిమా కంటెంట్ మీద ఆ చిత్ర నిర్మాతకి బలమైన నమ్మకం ఉండడం తో నైజాం లో సొంతంగా ఎందుకు విడుదల చెయ్యకూడదు అనే ఆలోచన కలిగిందట..ఇదే విషయాన్నీ చిరంజీవి గారికి కూడా నిర్మాత తెలియచేయగా ఆయన కూడా అలాగే చెయ్యండి మంచి లాభాలు వస్తాయి అని చెప్పాడట.

దీనితో ఈ చిత్రం నైజాం హక్కులు దిల్ రాజు కి కాకుండా సొంతగా విడుదల చేసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారట..సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శశి ఆద్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్..మరో పెద్ద సంస్థ కూడా ఇందులో భాగస్వామి అవ్వబోతుందట..తనకి నైజాం రైట్స్ ఇస్తాను అని చెప్పి చివరి నిమిషం లో ఇలా చెయ్యడం పై దిల్ రాజు అసంతృప్తి తో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట.