Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కు అనుకూలంగా పోలీస్ యంత్రాంగం పనిచేసిందనే ఆరోపణలు బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడులో తమదే విజయం అంటే తమదనే వాదనలు వస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ విధానంపై మండిపడ్డారు. అధికారం కోసం దిగజారిపోయి నిస్సిగ్గుగా వ్యవహరించింది. సీపీ, ఎస్పీ ఇద్దరు టీఆర్ఎస్ కు కొమ్ము కాసి వారి స్వామి భక్తిని నిరూపించుకున్నారు. దీంతో మునుగోడు పరిస్థితిపై ఎవరి ధీమా వారికే ఉంది.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ కుయుక్తులు పన్నింది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు మునుగోడులో మకాం వేసి ఎన్నో ప్రలోభాలకు పాల్పడింది. డబ్బు విచ్చలవిడిగా పంచి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించినా చివరకు గెలిచేది బీజేపీయేనని చెబుతున్నారు. పోలీసుల దౌర్జన్యంతోనే అధికార పార్టీ తప్పులు చేస్తోంది. దీంతో అధికార పార్టీ వ్యవహారం ఇంత దారుణంగా ఉండటంతో బండి సంజయ్ టీఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు.
ఎన్నికల కమిషన్ కూడా టీఆర్ఎస్ కు తొత్తుగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందిన వారు మునుగోడులో ఉన్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. మునుగోడు ఓటింగ్ శాతం చూసిన తరువాత అందరిలో స్ఫూర్తి నింపింది. ఓటర్లలో చైతన్యం అందరికి సంతృప్తినిచ్చింది. యువత ఓటు వేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగినదే. మునుగోడు ఎన్నికల్లో అధికార పార్టీ మందు, డబ్బు పంపిణీ చేసి తన స్థాయిని మరిచింది. ఒక్కో నాయకుడికి డబ్బు సంచులు అందివ్వడం అందించి గెలుపు కోసం నానా తంటాలు పడినా నిష్ర్పయోజనమే.

ఎన్నికల ప్రక్రియనే పక్కదారి పట్టించింది. ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణం. మునుగోడులో వేలాది మంది ఉంటే నలభై రెండు మాత్రమే దొరికారని అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. గులాబీ నేతలకు గులాం గిరీ చేస్తున్న అధికారుల తీరు అసమంజసంగా ఉంది. కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తోంది. ఎవరెన్ని చేసినా చివరకు గెలిచేది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మునుగోడులో అధికార పార్టీ తీరు హాస్యాస్పదం.
టీఆర్ఎస్ పార్టీలో డిప్రెషన్ రావడంతోనే వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మరోమారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమే. దీన్ని ఎవరు ఆపలేరు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి అనుకూలంగా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం గమనార్హం.