Unstoppable NBK: సినిమాలు, రాజకీయాలు, బసవతారకం ఆస్పత్రి బాధ్యతలు ఈ మూడే ప్రపంచంగా గడిపేస్తారు నందమూరి బాలకృష్ణ. ఈయన సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో నడిచినా తిరుగు లేని మనిషి గా ఉంటారు. ఇక ఇలాంటి స్టార్ హీరో ఒక షోను హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు కావచ్చు.. ఆహా ఆయనకు కొన్ని బాధ్యతలు ఇచ్చింది. అన్ స్టాపబుల్ విత్ NBK అనే షోను స్టార్ట్ చేసి తిరుగులేని టాక్ షోగా దూసుకుపోయింది. అయినా బాలయ్య హోస్ట్ చేయడం ఏంటి? అసలే స్టేజ్ లపై ఒక్కోసారి ముక్కు మీద కోపం చూపిస్తుంటారు. సినిమాలు అంటే ఒకే కానీ షోలు ఏంటి బాలయ్యతో అవుతుందా అని అనుకున్నారు నెటిజన్లు.
ఒక్కసారిగా అన్ స్టాపబుల్ విత్ NBK ను ప్రారంభించారో లేదో ఓ రేంజ్ లో దూసుకొని పోయింది ఈ షో. షో అంటే ఇది.. ఆహా బాలయ్యా నువ్వు తోపు.. సినిమాలు, రాజకీయాలు, హోస్ట్ ఇలా నీకు నువ్వు పోటీ, సాటి అంటూ కామెంట్లు వచ్చాయి. ఆ రేంజ్ లో షోను నడిపించారు బాలయ్య. ఇప్పటి వరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ NBK. ఈ రెండు సీజన్ లో ఎంతో మంది టాప్ స్టార్ సెలబ్రెటీస్ తో బాలయ్య బాబు చేసిన సరదా చిట్ చాట్ ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు అన్నట్టుగానే సాగాయి.
మూడవ సీజన్ ఉండదేమో అనుకున్నవారికి ఆహా గుడ్ న్యూస్ చెప్పింది. లిమిటెడ్ వర్షన్ తో మూడవ సీజన్ ను రీసెంట్ గానే ప్రారంభించింది ఆహా టీ. ఈ ఎడిషన్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు అని సీజన్ ప్రారంభం ముందు నుంచే ఓ టాక్ ఉండేది. అయితే ఈ సీజన్ కోసం అల్లు అరవింద్ నిజంగానే చిరంజీవిని సంప్రదించారట. డేట్స్ చూసి ఫిక్స్ చేస్తాను అని చెప్పినా చిరు.. ప్రస్తుతం ఈ షోలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే చిరు, బాలయ్యల మధ్య గతంలోనే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అనేక సందర్బాల్లో బాలయ్య కొన్ని విషయాలలో చిరు పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కానీ ఈ గ్యాప్ తొందరలోనే పోయి.. ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉంటారని అభిమానుల కోరిక. అయితే చిరు బాలయ్యతో కలిసి చాలా రోజులు అయినట్టుంది. కానీ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు మాత్రం బాలయ్యను కలిశారు. వీరిద్దరితో బాలయ్య ఆప్యాయంగా మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ లో నిలిచాయి. కుటుంబంతో మంచిగా ఉన్నా చిరు మాత్రం కలవలేకపోతున్నారు అనే టాక్ ఉంది. మరి వీరిద్దరి మధ్య గ్యాప్ పోవడానికి అల్లు అరవింద్ నిర్వహించే ఈ షో కారణం అవుతుందా లేదా చూడాలి.