Godfather Movie Preview Talk: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5 వ తారీఖున తెలుగు , హిందీ మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు మరియు ప్రోమోలు అభిమానుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసాయి..ఇక ఈరోజు విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ కి కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..ఆచార్య వంటి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత వస్తున్నా సినిమా కావడం తో ఈ చిత్రం థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లో జరగలేదనే చెప్పాలి..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 92 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం..పాజిటివ్ టాక్ వస్తే కేవలం వారం రోజుల లోపే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి..ఇక ఈ సినిమాకి సంబంధించిన మొట్టమొదటి షో దుబాయి లో కొంతమంది పాత్రికేయులకు చూపించారట మూవీ టీం.

వాళ్ళ నుండి వచ్చిన టాక్ ప్రస్తుతం సోషల్ మీడియా ని ఊపేస్తోంది..రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి ఈ సినిమా సరైన కంటెంట్ ఉన్న సినిమా అని..కచ్చితంగా మెగా అభిమానులకు పూనకాలు రప్పించే విధంగానే ఈ సినిమాని డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడట..ముఖ్యం గా సెకండ్ హాఫ్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునే విధంగా చేస్తుందట..ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..మలయాళం లో ఈ సినిమా నిడివి రెండు గంట 50 నిముషాలు ఉంటె అందులో హీరో మోహన్ లాల్ కేవలం 50 నిముషాలు మాత్రమే కనిపిస్తాడు..కానీ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి రెండు గంటల పాటు కనిపిస్తాడట..ఆయన లేని సన్నివేశాలలో కూడా చిరంజీవి మార్క్ ఉండేలా డిజైన్ చేసాడట డైరెక్టర్..అంతే కాకుండా ఒరిజినల్ వెర్షన్ స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది.

కానీ ఇక్కడ మాత్రం డైరెక్టర్ ఫాస్ట్ గా స్క్రీన్ ప్లే నడిపించినట్టు సమాచారం..అంతే కాకుండా ఒరిజినల్ వెర్షన్ లో లేని పది క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉంటాయట..ఒక పక్కా కమర్షియల్ మూవీ తీరులో గాడ్ ఫాదర్ మెగాస్టార్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుంది..పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి కిక్ ని ఇచ్చిందో మెగాస్టార్ ఫాన్స్ కి గాడ్ ఫాదర్ సినిమా కూడా అలాంటి కిక్ ని ఇస్తుందని దుబాయి నుండి అందుతున్న రిపోర్ట్..మరి ఇందులో ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే ఒక రోజు వేచి చూడాల్సిందే.
[…] […]