Mahesh Babu: మహేష్ తల్లిగారు ఇందిరా దేవి మరణం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. డెబ్భై ఏళ్ల వయసులో ఇందిరా దేవి అనారోగ్యంతో మరణించారు. సెప్టెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున ఇందిరా దేవి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అభిమానులు, చిత్ర ప్రముఖులు ఇందిరా దేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు సమర్పించారు. కొందరు సోషల్ మీడియా వేదికగా సానుభూతి ప్రకటించారు. తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు మహేష్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన మరణాంతర కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.

కాగా ఇందిరా దేవి అస్థికలు గంగానదిలో కలిపేందుకు మహేష్ హరిద్వార్ వెళ్లారు. పుణ్యక్షేత్రమైన హరిద్వార్ వద్దగల గంగానదిలో తల్లి అస్థికలు కలిపారు. పండితుల వేదమంత్రాల మధ్య ఈ కీలక ఘట్టం పూర్తి చేశారు. మహేష్ తల్లి అస్థికలు గంగానదికి సమర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంచె కట్టు, తెల్లబట్టలో సాంప్రదాయంగా మహేష్ బాబు కనిపించారు. మహేష్ తో పాటు బాబాయ్ ఆదిశేషగిరిరావు, బావ జయదేవ్ గల్లా ఉన్నారు.
కాగా ఏడాది వ్యవధిలో మహేష్ కుటుంబంలో రెండు మరణాలు సంభవించాయి. జనవరిలో మహేష్ అన్నగారైన రమేష్ బాబు అనారోగ్యంతో అకాల మృతి చెందారు. రమేష్ మరణం కృష్ణ, మహేష్ లను తీవ్ర వేదనకు చేసింది. తాజాగా మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.

ప్రస్తుతం మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ తో 28వ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. కొద్దిరోజుల్లో సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు. అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు విడుదలయ్యాయి.
An emotional #MaheshBabu immerses the ashes of his late mother #IndiraDevi in Haridwar
🎥Pallav Paliwal pic.twitter.com/OP2jyhv9WV
— The Daily Jagran (@TheDailyJagran) October 3, 2022