Prabhas Health: టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది..బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది..బాహబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ కూడా వసూళ్ల పరంగా దుమ్ము లేపేశాయనే చెప్పాలి..ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ అభిమానులు ఆది పురుష్ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికి తెలిసిందే..శ్రీ రాముని పాత్రలో తమ అభిమాన హీరో ఎలా ఉంటాడో చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతని కనబర్చారు..నిన్న అయోధ్య లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని పెట్టి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు..ఆ టీజర్ అభిమానులకు అంతగా నచ్చలేదు..గ్రాఫిక్స్ ఎదో కార్టూన్ సినిమాని చూస్తున్నట్టు గా అనిపించింది అంటూ కామెంట్స్ చేసారు.

ఇదంతా పక్కన పెడితే నిన్న అయోధ్య లో జరిగిన ఈవెంట్ లో ప్రభాస్ ని చూసిన అభిమానులు కాస్త ఆందోళన కి గురైయ్యారు..ప్రభాస్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ డైరెక్టర్ ఓం రాత్ మరియు హీరోయిన్ కృతి శెట్టి సహాయం తీసుకొని నడవడం ని చూసి అసలు మా ప్రభాస్ కి ఏమైంది?..ఎందుకు అంత ఇబ్బంది పడుతూ నడుస్తున్నాడు అంటూ కంగారు పడ్డారు..విషయం ఏమిటో ఆరా తియ్యగా ప్రభాస్ కి ఇటీవలే మోకాళ్ళకు చిన్న సర్జరీ జరిగినట్టు తెలుస్తుంది.
డాక్టర్లు కనీసం నెల రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన కూడా ప్రభాస్ తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల షూటింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిందని..దాని వల్ల మోకాళ్ళ నొప్పి బాగా పెరిగిపోవడం వల్ల ఆయన సరిగా నడవలేకపోతున్నాడని తెలిసింది.

.ప్రభాస్ రిస్కీ ఫైట్స్ కి పెట్టింది పేరు అనే విషయం మన అందరికి తెలిసిందే..బాహుబలి సినిమా సమయం లో కూడా ఆయనకి ఎన్నో సార్లు సర్జరీ జరిగింది..చూసేదానికి లేజీగా కనిపించే ప్రభాస్ సినిమా షూటింగ్ అంటే మాత్రం తన శరీరం ని హూనం చేసుకుంటాడని డైరెక్టర్ రాజమౌళి ఎన్నో సందర్భాలలో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు కూడా అదే జరిగింది..ప్రభాస్ ని నిన్న ఆ పరిస్థితి లో చూసిన
అభిమానులు సినిమాలకంటే నువ్వు బాగుండడం మాకు ముఖ్యం అన్నా..దయచేసి నీ ఆరోగ్యాన్ని సరి చూసుకో అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.
[…] Also Read: Prabhas Health: ప్రభాస్ ఆరోగ్యానికి ఏమైంది అంట… […]